P Krishna
Kolar Crime News: చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురై ఎన్నో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోతున్నారు.
Kolar Crime News: చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురై ఎన్నో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోతున్నారు.
P Krishna
ఈ మధ్య కాలంలో నేరాల సంఖ్య బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న జంటలు అక్రమ సంబంధాల నేపథ్యంలో ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. హంతకులు ఎంత పకడ్భందీగా నేరం చేసి తప్పించుకోవాలని చూసినా.. పోలీసులు ఎప్పటికైనా ఆ నేరాన్ని ఛేదిస్తుంటారు. ఓ హత్య కేసులో బావా బామ్మర్ధి ఏడాదిగా పోలీసుల కళ్లు కప్పి తిరిగారు.. ఎట్టకేలకు వారిని పట్టుకొని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. ఈ ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కోలార్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మెరహళ్లి సరస్సులో 2023, ఏప్రిల్ 19న ఓ ముస్లిం మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమెను దారుణంగా హత్య చేసి రాయికి కట్టి సరస్సులో పడేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళను చంపిన నింధితుల వేటలో పడ్డారు. ఏడాదిగా హత్య కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు మహిళ మర్డర్ మిస్టరీ ఛేదించారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులోని హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామారెడ్డి కాలనీకి చెందిన సుల్తానా తాజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ విక్రయిస్తు జీవనం కొనసాగిస్తుంది. ఆమెకు భర్త లేడు.. పిల్లలతో కలిసి జీవిస్తుంది. కోలార్ లోని నూర్‌నగర్ కు చెందిన అబ్రార్ అహ్మద్ బెంగుళూరు రామయ్య రెడ్డి కాలనీలోని మొబైల్ షాప్ నడుపుతూ అక్కడే నివాసం ఉంటున్నాడు. కొంతకాలం క్రితం సుల్తానా తాజ్, అబ్రార్ కు మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది.
అబ్రార్ అహ్మద్ కి అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలోనే అబ్రార్ ని సుల్తానా డబ్బులు డిమాండ్ చేస్తూ వచ్చింది. తమ ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు అడ్డు పెట్టుకొని అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చింది. దీంతో ఆమె అడ్డు ఎలాగైనా తొలగించుకోవాలని నిశ్చయించుకున్నాడు అబ్రార్. సమయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో 2023, మార్చి 17న సుల్తానాను తన కారులో ఎక్కించుకొని కోలార్ చేరుకున్నాడు.మార్గ మద్యలో తన బావ సాధిక్ పాషాను కలిసి ముగ్గురూ నిర్మాణుష్య ప్రదేశానికి చేరుకొని సుల్తానాపై కత్తితో దాడి చేశారు, జాక్ రాడ్ తో కొట్టడంతో ఆమె చనిపోయింది. మృతదేహాన్ని ఓ రాయికి చుట్టి అక్కడే ఉన్న సరస్సులో పడవేశారు. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సుల్తానా తాజ్ తల్లి హసానీ తాజ్ హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టింది. ఏడాది కాలం పాలు నింధితుల కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపారు పోలీసులు. సుల్తానా ఫోన్ కాల్స్, వాట్సాప్ చాటింగ్ అన్నింటిపై దర్యాప్తు చేశారు. ఏడాది పాటు జరిగిన విచారణలో అబ్రార్ తో ఆమె అక్రమ సంబంధం బయటపడింది. ఈ క్రమంలోనే అతన్ని పట్టుకొని తమ స్టైల్లో విచారించగా తానే హత్య చేశానని.. అందుకు తన బావ సహకరించాడని ఒప్పుకున్నాడు. దీంతో ఏడాదిగా కొనసాగిన మిస్టరీ ఎట్టకేలకు వీడిపోయింది.