iDreamPost

కరీంనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. బ్లేడ్‌తో యువతి గొంతు కోసి..

ఇటీవల దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది.. ఒంటరిగా బయటికి వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలతో కామాంధులు రెచ్చిపోతున్నారు.

ఇటీవల దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది.. ఒంటరిగా బయటికి వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలతో కామాంధులు రెచ్చిపోతున్నారు.

కరీంనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. బ్లేడ్‌తో యువతి గొంతు కోసి..

దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల పరంపర పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్న పిల్లలు, వృద్ద మహిళలు అని వ్యత్యాసం చూడకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తమ కామవాంఛ తీర్చుకున్న తర్వాత గుట్టు బయటపడుతుందని హత్యలకు తెగబడుతున్నారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఇలాంటి కేసులు పదుల సంఖ్యల్లో నమోదు అవుతున్నాయి. కొంతమంది యువకులు ప్రేమ పేరుతో యువతులను వంచించి అవసరం తీరిన తర్వాత దారుణంగా హత్య చేస్తున్నారు.  మరికొంతమంది తమ ప్రేమను కాదన్న యువతులపై దాడులకు తెగబడుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. తన ప్రేమను కాదన్న యువతిపై  కసితో అత్యంత కిరాతకంగా దాడి చేశాడు ఓ ప్రేమోన్మాది. వివరాల్లోకి వెళితే..

దేశంలో నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా.. కొంతమంది మగాళ్ల తీరు అస్సలు మారడం లేదు. ఓ ప్రేమోన్మాధి దారుణానికి వడికట్టాడు.. తన ప్రేమను కాదన్న యువతిపై బ్లేడుతో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. యువకుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో ఈ ఘటన తీవ్ర కలకం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామంలో బొద్దుల సాయి అనే యువకడు ఇసుక క్వారీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతి ఎమ్మెస్సీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఇంట్లో ప్రిపేర్ అవుతుంది. గత నాలుగేళ్ళుగా యువతి వెంట పడుతూ వస్తున్నాడు బొద్దల సాయి. కానీ అతని ప్రేమను ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తుంది.

young man attacked on women

ఈ విషయం తన తల్లిదండ్రులకు యువతి చెప్పడంతో గ్రామంలోని పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఇకపై ఆ యువతి జోలికి వెళ్లవొద్దని హెచ్చరించారు. దీంతో కొంతకాలం సైలెంట్ గా ఉన్న సాయి మళ్లీ ఆ యువతిని వెంబడించడం, వేధించడం మొదలు పెట్టాడు. తనను పెళ్లి చేసుకోకపోతే… చంపుతానని బెదిరించాడు. అంతేకాదు ఆ యువతిని పెళ్లి చేసుకుంటా అంటూ ఏకంగా తల్లిదండ్రులకు మెసేజ్ కూడా పంపాడు. దీంతో మరోసారి సాయిని హెచ్చరించారు యువతి తల్లిదండ్రులు.  గురువారం యువతి తండ్రి పనిపై ఇల్లంతకుంట కు వెళాడు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న బొద్దుల సాయి ఇంట్లోకి చొరబడి బ్లేడుతో యువతిపై దాడి చేశాడు. దీంతో యువతి గట్టిగా కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. స్థానికులు వెంటనే యువతిని చికిత్స నిమిత్తం కరీంనగర్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నింధితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి