iDreamPost
android-app
ios-app

ఓ వ్యక్తితో సహజీవనం.. మరో వ్యక్తితో రొమాన్స్! మొదటి ప్రియుడు ఏంచేశాడంటే?

  • Published Mar 20, 2024 | 3:20 PM Updated Updated Mar 20, 2024 | 3:20 PM

Kakinada Crime News: ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు ఎన్నో దారుణాలకు తెరలేపుతున్నాయి. కొన్నిసార్లు హత్యలకు కూడా దారి తీస్తున్నాయి.

Kakinada Crime News: ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు ఎన్నో దారుణాలకు తెరలేపుతున్నాయి. కొన్నిసార్లు హత్యలకు కూడా దారి తీస్తున్నాయి.

  • Published Mar 20, 2024 | 3:20 PMUpdated Mar 20, 2024 | 3:20 PM
ఓ వ్యక్తితో సహజీవనం.. మరో వ్యక్తితో రొమాన్స్! మొదటి ప్రియుడు ఏంచేశాడంటే?

ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా నేరాల సంఖ్య దారుణంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. ఏ బంధమైనా సరే నమ్మకంతో ముడిపడి ఉంటుంది. ఆ నమ్మకం కోల్పోతే.. ఆ బంధం నరకంగా మారుతుంది. చాలా జంటలు తమ పార్ట్‌నర్స్ ని మోసం చేయడం.. ఎప్పటికో ఒకసారి అది కాస్త బయట పడటంతో గొడవలు, కొట్లాటలు మొదలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ఈ వ్యవహారాలు హత్యలకు కూడా దారి తీస్తున్నాయి. ఓ వ్యక్తితో సహజీవనం చేస్తూనే మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్న మహిళపై ప్రియుడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కాకినాడ జిల్లా చేబ్రోలు గ్రామంలో అక్రమ సంబంధం నేపథ్యంలో జరిగిన జంట హత్య తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన పోసిని శ్రీను (45), పెండ్యాల లోవమ్మ (35) ని అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు కత్తితో విచక్షణారహితంగా నరికి చంపాడు. అనంతరం లోవమ్మ తల్లి రామలక్ష్మిపై కూడా కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పిఠాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పెండ్యాల లొవమ్మ అనే మహిళ గత కొంత కాలంగా లోక నాగబాబుతో సహజీవనం చేస్తుంది. నాగబాబు తో సహజీవనం చేస్తూనే అదే గ్రామానికి చెందిన పోసిన శ్రీను తో అక్రమ సంబంధం పెట్టుకుంది.

ఈ విషయం ఆ నోటా.. ఈనోటా లోక నాగబాబు కి తెలిసింది. ఈ క్రమంలోనే శ్రీను, లోవమ్మ ఒకేచోట కలిసి ఉండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్న నాగబాబు అప్పటికే తనతో తెచ్చుకున్న కత్తితో అతి కిరాతకంగా హత్య చేశాడు. వీరిద్దరి అక్రమ సంబంధానికి సహకరించిందన్న కోపంతో పెండ్యాల లోవమ్మ తల్లి రామలక్ష్మిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో రామలక్ష్మికి తీవ్ర గాయలు కావడంతో స్థానికులు హాస్పిటల్ కి తరలించారు. దాడి సమయంలో నాగబాబు కోపంతో ఊగిపోతూ కత్తితో హల్ చల్ చేశాడని స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet