iDreamPost
android-app
ios-app

ప్రియుడిపై కోపంతో పక్కా స్కెచ్ వేసి.. మహా దారుణం ఈ దారుణం!

  • Published Dec 26, 2023 | 6:47 PM Updated Updated Dec 26, 2023 | 6:47 PM

Hyderabad Crime News: ప్రేమించినంత కాలం నచ్చిన వాళ్లు బ్రేకప్ చెప్పగానే శత్రువులు అవుతారు. అలాంటి వారిపై కక్ష సాధించాలని చాలామంది భావిస్తూ ఉంటారు.

Hyderabad Crime News: ప్రేమించినంత కాలం నచ్చిన వాళ్లు బ్రేకప్ చెప్పగానే శత్రువులు అవుతారు. అలాంటి వారిపై కక్ష సాధించాలని చాలామంది భావిస్తూ ఉంటారు.

  • Published Dec 26, 2023 | 6:47 PMUpdated Dec 26, 2023 | 6:47 PM
ప్రియుడిపై కోపంతో పక్కా స్కెచ్ వేసి.. మహా దారుణం ఈ దారుణం!

ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అనే చెప్పాలి. అది అమ్మాయి- అబ్బాయి మధ్యనా.. భార్యాభర్తల మధ్యనా అనేది తర్వాతి సంగతి. ప్రేమ అనే మధురానుభూతిని అందరూ తమ జీవితంలో ఆస్వాధిస్తారు. అయితే ఈ ప్రేమకు సంబంధించి అమ్మాయి- అబ్బాయి మధ్యన చిగురించే లవ్ ఎంతో స్పెషల్. దానిని జాగ్రత్తగా చూసుకుంటే లైఫ్ కూడా అంతే స్పెషల్ గా సాగిపోతూ ఉంటుంది. కానీ, కొందరు మాత్రం చిన్న గొడవలు, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. అలాంటి ఒక హారర్ ప్రేమకథే ఇది కూడా. ఆ అమ్మాయి పక్కా పథకంతో మాజీ ప్రియుడి జీవితాన్ని నాశనం చేయాలని చూసింది.

సాధారణంగా ప్రేమలో గొడవలు, కలహాలు సర్వ సాధారణం. అబ్బాయి- అమ్మాయి మధ్య ప్రేమ అంటే గొడవలు, అలకలు కూడా ఉంటూనే ఉంటాయి. అయితే అవి ఎప్పుడూ హద్దులు దాటకూడదు. అవి హద్దు దాటితే అది పగ, ప్రతీకారంలా మారుతుంది. ఇప్పుడు ఒక మాజీ ప్రేమికుల విషయంలో అదే జరిగింది. ప్రేమించి తనని వదిలేశాడనే అక్కసుతో మాజీ ప్రియుడిపై పగ తీర్చుకునేందుకు ఆ అమ్మాయి సినిమా స్టైల్లో స్కెచ్ వేసింది. అతని జీవితాన్నే నాశనం చేయాలని చూసింది. కానీ, చివరకు ఆమే కటకటాల పాలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లా చదువుతున్న రింకీ అనే అమ్మాయికి సరూర్ నగర్ కి చెందిన శ్రావణ్ కుమార్ అనే అబ్బాయిని ప్రేమించింది. అయితే వారి మధ్య మనస్పర్ధల కారణంగా ఇద్దరూ తమ ప్రేమకు పుల్ స్టాప్ పెట్టారు.

Make a perfect sketch of your boyfriend in anger

ఇద్దరూ ఎవరి జీవితం వాళ్లు జీవించాలి అనుకున్నారు. కానీ, తన ప్రేమను కాదని.. తనను దూరం పెట్టాడనే కోపంతో అతనిపై పగ తీర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా పథకం రచించింది. తన మిత్రులతో కలిసి శ్రావణ్ కుమార్ ను క్రిమినల్ కేసులో ఇరికించాలని భావించింది. మధ్యవర్తి సాయంతో శ్రావణ్ కు కబురు పెట్టింది. అతడిని కలవాలంటూ చెప్పింది. తీరా శ్రావణ్ వచ్చిన తర్వాత తన మిత్రుల సాయంతో అతని కారులో గంజాయిని దాచింది. శ్రావణ్ వెళ్లిపోయిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని కారు నుంచి 40 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. అసలు విషయం వెలుగు చూసింది. ఈ కేసులో మాజీ ప్రియురాలి పాత్ర తెలిసి పోలీసులు కూడా షాకయ్యారు. అతనిపై పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పని చేసినట్లు తేలింది. శ్రావణ్ కుమార్ కారులో రింకీనే గంజాయి దాచిందనే విషయం వెలుగు చూసింది. దాంతో పోలీసులు రింకీతో సహా మహేంద్ర యాదవ్, దీక్షిత్ రెడ్డి, ప్రణీత్ గోపీ, సూర్య తేజ అంటూ మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. పాత గొడవల నేపథ్యంలోనే మాజీ ప్రియుడిపై కక్ష సాధించాలనే రింకీ ఇలా చేసిందని పోలీసులు నిర్ధారించారు. రింకీని మాత్రమే కాకుండా ఆమెకు సహకరించిన మిత్రులను సైతం అరెస్టు చేశారు. మరి.. మాజీ ప్రియుడిపై కక్ష సాధించాలని చూసి.. కటకటాల పాలైన రింకీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetmeritbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom