Hyderabad: స్టెతస్కోప్‌తో ఉరేసి, కత్తితో గొంతు కోసి మహిళ దారుణ హత్య!

Hyderabad Crime News: హైదరాబాద్ లోొ రోజు రోజుకీ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నారు. ఇద్దరు మహిళలు వెంట వెంటనే హత్యకు గురి కావడం తీవ్ర భయాందోళన కలిగిస్తుంది. మియాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని, జూబ్లీ హిల్స్ లో గృహిణి వారి ఇంట్లోనే హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపుతుంది.

Hyderabad Crime News: హైదరాబాద్ లోొ రోజు రోజుకీ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నారు. ఇద్దరు మహిళలు వెంట వెంటనే హత్యకు గురి కావడం తీవ్ర భయాందోళన కలిగిస్తుంది. మియాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని, జూబ్లీ హిల్స్ లో గృహిణి వారి ఇంట్లోనే హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపుతుంది.

హైదరాబాద్‌లో వరుసగా మహిళలు హత్యకు గురి కావడం భయాందోళన కలిగిస్తుంది. సోమవారం మియాపూర్‌లో ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆమె ఇంట్లోనే దుండగులు అతి దారుణంగా పొడిచి చంపారు. జూబ్లీ హీల్స్‌లో ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ భార్యను గుర్తు తెలియని హంతకులు అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది.  హత్యకు గురైన ఇద్దరు మహిళలు ఇంట్లో ఒంటరిగా  ఉండటం గమనించి దుండగులు దారుణంగా హత్య చేసినట్లు అర్థమవుతుంది. ఆర్ఎంపీ డాక్టర్ భార్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యూసఫ్‌గూడ, నవోదయ కాలనీలో నివాసం ఉంటున్న ఉమా మహేశ్వరరావు గత కొంతకాలంగా ఆర్ఎంపీ డాక్టర్ గా కొనసాగుతున్నాడు. ఎల్లారెడ్డి గూడలోని ఆలయం పక్కన ‘అమ్మ క్లీనిక్’ పేరిట ప్రాక్టీస్ రన్ చేస్తున్నారు.  నవోదయ కాలనీలో కొంత కాలంగా ఉమా మహేశ్వరరావు  భార్య సుధారాణి (44), కూతురు రుద్రారాణి, కొడకు శ్రీకర్ చంద్రతో కలిసి ఉంటున్నారు. హ్యాపీగా సాగిపోతున్న వీరి కుటుంబంలో దారుణం జరిగింది. సొమవారం సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి పక్కనే ట్యూషన్ కి వెళ్లారు. భర్త ఉమా మహేశ్వరరావు క్లీనిక్ కి వెళ్లాడు.

సుధారాణి ఇంట్లో ఒంటరిగా ఉంది.. అదే సమయంలో కొందరు దుండగులు ఇంట్లోకి చొరబడి సుధారాణిని అతి కిరాతకంగా హత్యచేసి చంపారు. స్టెతస్కోప్‌తో ఆమె గొంతుకు ఉరేసి, కత్తితో గొంతు కోసి హత్య చేశారు. సాయంత్రం కూతురు, కొడుకు వెళ్లి చూడగా సుధారాణి బెడ్ పై రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. ఆ స్థితిలో తల్లిని చూసిన పిల్లలు భయంతో వణికిపోయారు. పక్కనే ఉన్న స్థానికులకు విషయం చెప్పగా వెంటనే వారు పోలీసులకు, ఉమా మహేశ్వరరావుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చుట్టుపక్కల అన్ని వెతికి చూశారు.. ఎక్కడ మారణాయుధాలు కనిపించలేదని అన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలానికి పోలీసు జాగిలాలు దిగాయి, క్లూస్ టీమ్ ని రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. అలాగే సీసీ టీవి ఫుటేజ్ పరిశీలిస్తున్నామని అన్నారు. కుటుంబ తగాదాలు ఏమైనా ఉన్నాయా? వ్యక్తిగత సమస్యలు ఉన్నాయా? డబ్బు, నగల కోసం ఈ హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు భర్త ఉమా మహేశ్వరరావు తమకు ఎవరితో శత్రుత్వం లేదని.. తన భార్య అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండేదని.. తల్లిలేని పిల్లలు అయ్యారని కన్నీరు మున్నీరయ్యారు. ఆర్ఎంపీ భార్య దారుణ హత్య ఘటనతో స్థానికంగా సంచలనం రేపింది.

Show comments