iDreamPost
android-app
ios-app

వీడియో: డబ్బుల కోసం..కన్నతల్లినే కడతేర్చిన కసాయి కొడుకు!

కని పెంచిన తల్లినే కాటికి పంపించాడు ఓ కిరాతకపు కొడుకు.. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటూ దైవం కన్నా తల్లికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాం. అలాంటిది ఓ క్రూరుడైన కొడుకు తల్లిని అతి దారుణంగా హత్య చేశాడు

కని పెంచిన తల్లినే కాటికి పంపించాడు ఓ కిరాతకపు కొడుకు.. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటూ దైవం కన్నా తల్లికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాం. అలాంటిది ఓ క్రూరుడైన కొడుకు తల్లిని అతి దారుణంగా హత్య చేశాడు

వీడియో: డబ్బుల కోసం..కన్నతల్లినే కడతేర్చిన కసాయి కొడుకు!

ఈ భూమిపై వెలకట్టలేనిది అంటూ ఉంది అంటే.. అది అమ్మ ప్రేమ మాత్రమే. అంతేకాక  ఏ స్వార్థంలేని ప్రేమ తల్లిది మాత్రమే. మాతృమూర్తి.. తన బిడ్డలకు ఏ కష్టం లేకుండా, అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేస్తుంది. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తన అవసరాలను త్యాగం చేస్తూ.. పిల్లల సంతోషం కోసమే పరితపిస్తుంది. అలా ఎన్నో కష్టాలు పడుతూ బిడ్డలను పెంచి పెద్ద  చేస్తే.. కొందరు బిడ్డలు మాత్రం చావునే ఆ తల్లికి బహుమతిగా ఇస్తున్నారు. కన్న తల్లి ప్రేమను మర్చి.. దారుణంగా హత్య చేస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. కొందరు పుత్ర రత్నాలు డబ్బుల కోసం అమ్మలను హత్య చేస్తున్నారు. తాజాగా షాద్ నగర్ లో ఘోరమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్-కేశంపేట రోడ్డులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లిని తనయుడు కడతేర్చాడు.  షాద్ నగర్ లో సుగుణమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది. స్థానికంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆమె జీవనం సాగిస్తుంది. ఆమెకు శివకుమార్ అనే కుమారుడు ఉన్నాడు. తరచూ డబ్బుల కోసం తన తల్లి..శివకుమార్ వేధించే వాడు. అలానే ఆదివారం రాత్రి కూడా కూడా డబ్బుల కోసం తల్లి సుగుణమ్మతో శివకుమార్ గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఆమె తన వద్దు డబ్బులు లేవని చెప్పడంతో కొడుకు విచక్షణ కోల్పోయి.. తల్లిపై దాడి తెగపడ్డాడు. ఆమెను విచక్షణరహితంగా దాడి చేసి..తీవ్రంగా గాయపర్చిచాడు.

కొడుకు దారుణంగా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అయితే తెల్లవారే సరికి సుగుణమ్మ చనిపోయింది. ఇది గమనించిన నిందితుడు తన తల్లి అనారోగ్యంతో మరణించిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. తన ప్రాణాలను ఫణంగా పెట్టి జన్మనిచ్చిన తల్లిపై కొందరు కొడుకులు దాడులు చేస్తున్నారు.

భార్య మోజులో కొందరు, డబ్బుల కోసం మరికొందరు పుత్రులు కన్న తల్లిదండ్రులను హింసిస్తున్నారు. అంతేకాక మరికొందరు కొడుకులు అయితే పున్నమ నరకం నుంచి కాపాడేదేమో.. వాళ్లే నరకం చూపిస్తున్నారు. మరి.. చిన్నతనంలో సేవలు చేసిన తల్లికి వృద్ధాప్యంలో సేవలు చేయడం మానేసి..దారుణంగా చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూస్తే.. మానవ సంబంధాలు రోజూ రోజుకీ మంటల కలిసిపోతున్నాయి అనే అనుమానం కలుగుతుంది. మరి.. ఇలాంటి కసాయి కొడుకులను ఏ విధంగా శిక్షించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.