iDreamPost
android-app
ios-app

దంపతుల దారుణం.. క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక..

Keesara Crime News: క్రెడిట్ కార్డు ఇస్తాం అనగానే చాలా మంది మాకు కావాలి మాకు కావాలి అంటారు. కానీ, తీసుకున్నాక ఇలాంటి పరిస్థితులు కూడా ఎదురుకావచ్చు.

Keesara Crime News: క్రెడిట్ కార్డు ఇస్తాం అనగానే చాలా మంది మాకు కావాలి మాకు కావాలి అంటారు. కానీ, తీసుకున్నాక ఇలాంటి పరిస్థితులు కూడా ఎదురుకావచ్చు.

దంపతుల దారుణం.. క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక..

ప్రస్తుతం క్రెడిట్ కార్డు అనేది చాలా సాధారణ విషయంగా మారిపోయింది. రోజుకు కనీసం పది ఫోన్లు చేసి ఆ క్రెడిట్ కార్డును మీకు అంటగడతారు. ఆ తర్వాత కార్డు ఉందిగా అని చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అవసరాలకు వాడేస్తుంటారు. కానీ, నెల తిరిగే సరికి దానికి బిల్లు కట్టాల్సి వస్తుంది. కొంతమంది వాడినంత తేలిగ్గా బిల్లు కట్టలేకపోవచ్చు. ఒక్కసారి క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతే వాడుకున్న మొత్తానికి వడ్డీలు, చక్ర వడ్డీలు, భూ చక్రవడ్డీలు అంటూ అప్పు తడిసిమోపెడు అవుతుంది. ఆ అప్పును ఏదో ఒకటి కొందరు కడుతూ ఉంటారు. కానీ, కట్టలేకపోయిన వాళ్లు మాత్రం ఇదిగో.. ఈ దంపతుల్లాగా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు.

క్రెడిట్ కార్డు తీసుకునే ముందు ఒకటికి లక్షసార్లు ఆలోచించుకోవాలి. అసలు మనకు ఆ కార్డు అసరమా అనేది క్లారిటీ తీసుకోవాలి. తీసుకున్న మొత్తాన్ని తిరిగి కట్టగలమా అనే ప్రశ్న కూడా వేసుకోవాలి. అలా కాకుండా ముందుకెళ్లే.. మొదటికే మోసం రావచ్చు. క్రెడిట్ కార్డు తీసుకుని అప్పుల ఊబిలో చిక్కుకు పోయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఈ దంపతులతో సహా. కానీ, వీళ్లు మాత్రం అప్పుల భారం తట్టుకోలేక ప్రాణాలు వదిలేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఈ విషాదం మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక ఈ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

లాలాపేటకు చెందిన సురేశ్ కుమార్(48)కు మారేడ్ పల్లికి చెందిన భాగ్య(45)తో వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీళ్లు కీసరలోనే స్థిర పడ్డారు. సురేశ్ దంపతులు అప్పుల ఊబిలో చిక్కుకుపోయారు. శనివారం ఉదయం వీళ్లు విగతజీవులుగా కనిపించారు. వారి వద్ద సూసైడ్ నోట్ ఒకటి లభించింది. ఆ నోట్ లో తమ చావుకు కారణం క్రెడిట్ కార్డు అధికారులు అంటూ రాసుకొచ్చారు. సురేశ్ కు క్రెడిట్ కార్డు బిల్లు పెండింగ్ ఉంది. అది ఎన్ని నెలలుగా ఉందో క్లారిటీ లేదు. క్రెడిట్ కార్డు అధికారులు ఇంటికి వచ్చి బిల్లు కట్టాలంటూ ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చారు. వాళ్లు ఇంటికి వచ్చి అడగడంతో ఇరుగు పొరుగు ముందు పరువు పోయిందని మనస్థాపానికి గురైన సురేశ్- భాగ్య దంపతులు పిల్లలను బంధువుల ఇంటికి పంపి.. శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

సురేశ్- భాగ్య ఆత్మహత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే క్రెడిట్ కార్డు తీసుకుని వాడుకున్న పాపానికి రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. క్రెడిట్ కార్డు జారీ చేసే సమయంలో బ్యాంకు వాళ్లు ఎంతో మంచిగా మాట్లాడతారు. కానీ, ఒక్కసారి కార్డు తీసుకుని ఆ బిల్లు చెల్లించకపోతే వారి మాట, తీరులో మార్పులు వస్తాయి. దానికి వారిని కూడా తప్పుపట్టడానికి లేదు. కార్డు తీసుకునే ముందే మనమే ఒకటి వందసార్లు ఆలోచించుకోవాలి. కార్డు తీసుకుంటే ఎందుకు వాడతాం? ఎంత వాడతాం? వాడిన మొత్తాన్ని తిరిగి చెల్లించగలమా? ఒకవేళ వాడుకుని కట్టకపోతే మన పరిస్థితి ఏంటి? ఇలాంటి ప్రశ్నలు కార్డు తీసుకోక ముందే వేసుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతులు ఆత్మహత్య చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.