iDreamPost
android-app
ios-app

ఇంట్లో ఒంటరిగా మహిళ.. భర్త, పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఆ స్థితిలో!

  • Published Mar 25, 2024 | 4:59 PM Updated Updated Mar 25, 2024 | 4:59 PM

చాలా మంది మహిళలకు పిల్లలు, తన భర్తే ప్రపంచం. వారి భాగోగులు చూసుకుంటూ జీవితాన్ని సంతోషంగా గడుపుతుంటారు. అలానే వరంగల్ జిల్లాకు చెందిన మహిళ కూడా సంతోషంగా జీవనం సాగిస్తుంది. కానీ శనివారం ఒక్కసారిగా కుటుంబ సభ్యులకు షాకిచ్చింది.

చాలా మంది మహిళలకు పిల్లలు, తన భర్తే ప్రపంచం. వారి భాగోగులు చూసుకుంటూ జీవితాన్ని సంతోషంగా గడుపుతుంటారు. అలానే వరంగల్ జిల్లాకు చెందిన మహిళ కూడా సంతోషంగా జీవనం సాగిస్తుంది. కానీ శనివారం ఒక్కసారిగా కుటుంబ సభ్యులకు షాకిచ్చింది.

  • Published Mar 25, 2024 | 4:59 PMUpdated Mar 25, 2024 | 4:59 PM
ఇంట్లో ఒంటరిగా మహిళ.. భర్త, పిల్లలు  ఇంటికి వచ్చేసరికి ఆ స్థితిలో!

ఆమెది అందమైన కుటుంబం. బాగా చూసుకునే భర్త, రత్నాల లాంటి  ఇద్దరు పిల్లలు. ఇదే ఆమె ప్రపంచం. వారిని రెడీ చేసి స్కూల్ కి పంపించడం తిరిగి సాయంత్రం వారికి ఏదైనా స్నాక్స్ పెట్టి..వారి బాగోగులు చూసుకోవడమే ఆమె ప్రపంచం. అలా భర్త, పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్న ఆ మహిళ అందరికి షాక్ ఇచ్చింది. ఆ కుటుంబంలో విషాదం నింపింది. తల్లిని ఆస్థితిలో చూసి పిల్లలు, చుట్టుపక్కల వారు షాక్ గురయ్యారు. మరి.. అసలు ఏం జరిగింది.?  ఆకుటుంబంలో జరిగిన విషాదం ఏమిటి?. వరంగల్ లో జరిగిన ఓ మిస్టరీ ఘటనపై గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వరంగల్ జిల్లా మైనంపల్లికి చెందిన వెంగళ కిరణ్, సుప్రియా భార్యాభర్తలు, కిరణ్ తో సుప్రియాకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇక కిరణ్ హనుమకొండలోని ఓ మొబైల్ షాపులో  పని చేస్తున్నాడు. అలా మొబైల్ షాపులో పని చేస్తూ కిరణ్ కుటుంబాన్న పోషిస్తుండే వాడు. అదే సమయంలో సుప్రియ పరీక్షల కోసం ఆన్ లైన్ లో కోచింగ్ తీసుకుంటుంది. అలానే పిల్లలను రోజూ రెడీ చేసి..స్కూల్ కి పంపిస్తుంది. ఈక్రమంలో శనివారం ఉదయం మొబైల్ షాపుకు వెళ్లిన కిరణ్ సుప్రియకు ఫోన్ చేశాడు. పిల్లలను స్కూల్ కి పంపించానని సుప్రియ తన భర్తకు తెలిపింది.

మళ్లీ  మధ్యాహ్నం  2.30 గంటల సమయంలో మరోసారి కిరణ్ సుప్రియకు ఫోన్ చేశాడు. అయితే అటు వైపు నుంచి స్పందన రాలేదు. దీంతో కిరణ్ కి అనుమానం వచ్చింది. ఏదో బిజీగా ఉందిలే అని పట్టించుకోలేదు. ఇక శనివారం సాయంత్రం ఆరు గంటలకు పిల్లలు స్కూల్  నుంచి ఇంటికి వచ్చారు. ఆ పిల్లలు ఇంటికి వచ్చే సమయానికి తలుపులు మూసి ఉన్నాయి. దీంతో వాళ్లు చాలా సేపు తలుపు కొట్టగా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో ఆ పిల్లలు పక్కింటి వారికి విషయం చెప్పగా..వాళ్లు వచ్చి తలుపులను బలవంతగా తెరచారు. అలా లోపలికి వెళ్లగా సుప్రియా మంచంపై విగతజీవిగా పడి ఉంది. ఆమె ముఖంపై దిండుతో నొక్కినట్లుగా పోలీసులు గుర్తించారు. శరీరంపై గాయాలు ఉండటమే కాకుండా, ఆమె ఒంటిపై ఉన్న నగలు, చెవి వస్తువులు  లేవు. ఇంట్లోని బీరువా తలుపు తెరచి ఉన్నాయి.

ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా అత్యాచారం చేసి హతమార్చారా లేక చోరీ చేసి హత్య చేశారా అన్నది  మిస్టరీగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలాన్ని నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ పరిశీలించారు. ఇక అక్కడ ఇంట్లో బిర్యానీ ప్యాకెట్ కనిపించింది. అలానే సుప్రియా చేతి గాజులు పగిలిపోయి ఉన్నాయి. ఇక మధ్యాహ్నం సమయంలో ఎవరో ఎరుపు రంగు బైక్ సుప్రియ వాళ్ల ఇంటికి వచ్చారని, వాళ్ల బంధువులు అయిఉంటారని తాము అనుకున్నామని ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు. మొత్తంగా సుప్రియ మరణం అనేది మిస్టరీగా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom