iDreamPost
android-app
ios-app

వీడియో: దోశ లేదంటే చంపేస్తారా? కత్తితో దాడికి యత్నం!

  • Published Jul 06, 2023 | 5:15 PM Updated Updated Jul 06, 2023 | 5:24 PM
  • Published Jul 06, 2023 | 5:15 PMUpdated Jul 06, 2023 | 5:24 PM
వీడియో: దోశ లేదంటే చంపేస్తారా? కత్తితో  దాడికి యత్నం!

సాధారణంగా మనం టఫిన్ చేయడానికి హోటల్ కి వెళ్తుంటాము. మనకు నచ్చిన టిఫిన్ ను ఆర్డర్ చేసి.. హాయిగా ఆరగిస్తాము. అలానే కొన్ని సందర్భాల్లో మనకు కావాల్సిన టిఫిన్ హోటల్ లో ఉండక పోవచ్చు. అప్పుడు వేరే టిఫిన్  ఆర్డర్ చేసి.. హాయిగా ఆరగిస్తాము. లేదు అంటే.. మనకు నచ్చిన టిఫిన్ ఉన్న మరో హోటల్ కి వెళ్తాము. అయితే తాను అడిగిన టఫిన్ లేదని ఎవరైన.. హోటల్ సిబ్బందితో ఘర్షణకు దిగుతారా?. దాదాపు ఎవరూ అలాంటి పని చేయరు. కానీ ఓ వ్యక్తి మాత్రం.. తాను అడిగిన దోశ లేదన్నందుకు కత్తితో హోటల్ యజమానిపై దాడికి యత్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మెదక్ జిల్లా రామాయంపేటలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. రామాయంపేటలో మర్కు స్వామి అనే యువకుడు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. గురువారం మర్కు స్వామి స్థానికంగా ఉన్న ఓ టిఫిన్  సెంటర్ వద్దకు వెళ్లాడు. అక్కడ తనకు  దోశ కావాలని అడిగాడు. అయితే తమ టిఫిన్ సెంటర్లో  దోశ లేదని హోటల్ యజమాని తెలిపారు.  దోశ లేకుంటే టిఫిన్ సెంటర్ ఎందుకు పెట్టారంటూ వాగ్వాదానికి దిగాడు. ఇలా ఇరువురి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలోనే దోశ లేదంటారా అంటూ హోటల్ యజమానిపైకి యువకుడు కత్తితో దాడికి దిగాడు. అతడిని నిలువరించే క్రమంలో ఒక మహిళకు సైతం చిన్నపాటి గాయమైంది.

తన గాయాన్ని సైతం వీడియోలు మహిళ చూపించింది.  అదే సమయంలో వీడియో తీస్తున్న వారిపై కూడా యువకుడు దాడికి యత్నించాడు. స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను మెదక్ జిల్లా ఎస్పీకి ట్యాగ్ చేశారు. దోశలు లేవంటే చంపేస్తారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  మరి.. వైరల్ అవుతున్న వీడియోను వీక్షించి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss