నేటి సమజం సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో అభివృద్ధి చెందింది. కొత్త కొత్త విషయాలను కనిపెడుతూ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. చంద్రమండలంపైకి వెళ్లే అంతటి పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ఇలాంటి సమాజంలో కూడా ఇంకా మూఢనమ్మకాలను,మంత్రాలను నమ్మేవారికి కొదవే లేదు. నిత్యం ఏదో ఒకచోట తాంత్రిక పూజలు చేస్తున్నారంటూ వార్తలు వస్తునే ఉన్నాయి. అంతేకాక మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో కూడా పలువురుని చంపేశారు. తాజాగా మెదక్ జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి చేసుకుంది. అర్ధరాత్రి మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులను చెట్టుకు కట్టేసి హింసించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట పరిధి పాప్య తండాకు చెందిన నరేష్, ముడావత్ భాస్కర్, నేనావత్ భాస్కర్.. స్థానికంగా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గురువారం అమావాస్య ఉండగా, నరేష్, ముడావత్ భాస్కర్, నేనావత్ భాస్కర్ రాత్రి సమయంలో ఊర్లో తిరిగారు. అంతేకాక అర్ధరాత్రి కొంతమంది ఇళ్ల వద్ద నిమ్మకాయలు, పసుపు కుంకుమ, పచ్చిమిర్చి పెట్టారు. వారు అలా ఇళ్ల ముందు నిమ్మకాలు, పచ్చిమిర్చి పెట్టడాన్ని తండావాసులు గమనించారు. వెంటనే తండావాసులు ఆ ముగ్గురిని పట్టుకుని నిలదీశారు. అనంతరం వారిని ఓ చెట్టుకు కట్టేసి చితక కొట్టారు.ఇళ్ల ముందు నిమ్మకాయలు ఇతర వస్తువులు పెట్టి.. ఏం చేశారని వారిని నిలదీశారు.
వారు పెట్టిన నిమ్మకాయలను వారితోనే తీయించారు. ఇక మరుసటి రోజు శుక్రవారం పెద్దల ముందు పంచాయితీ పెట్టారు. ఇదే సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లారు. చెట్టుకు కట్టేసి ఉన్న ముగ్గురిని విడిపించారు. వారికి తీవ్ర గాయాలు కావడంతో నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు వారిని కొట్టిన రమావత్ ధర్మ, రవి, గన్యాలపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు. మరి..సాంకేతిక యుగంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.