iDreamPost
android-app
ios-app

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్యను అతి కిరాతకంగా..!

నేటికాలంలో అక్రమ సంబంధాలు, ఆర్థిక వివాదల కారణంగా జరిగే నేరాల సంఖ్య బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. తాజాగా ప్రేమించి పెళ్లి పెళ్లి చేసుకున్న భార్యపైనే దారుణానికి తెగబడ్డాడు.

నేటికాలంలో అక్రమ సంబంధాలు, ఆర్థిక వివాదల కారణంగా జరిగే నేరాల సంఖ్య బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. తాజాగా ప్రేమించి పెళ్లి పెళ్లి చేసుకున్న భార్యపైనే దారుణానికి తెగబడ్డాడు.

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్యను అతి కిరాతకంగా..!

భార్యాభర్తల బంధం అనేది  చాలా పవిత్రమైనది. రెండు వేరు వేరు మనస్సులు ఒకటిగా మారి చేసే ప్రయాణమే సంసారం. అందుకే కుటుంబ వ్యవస్థకు, దాంపత్య జీవితానికి మన దేశంలో ఎంతో ఘన చరిత్ర ఉంది. అయితే నేటికాలంలో దాంపత్య జీవితంలోకి వివాహేతర సంబంధాలు వచ్చి చేరడంతో నిట్టనిలువునా కూలిపోతున్నాయి. పరాయి వారి మోజులో పడి భాగస్వామిని మోసం చేస్తున్నారు. క్షణాల పడక సుఖం కోసం తనతోడుగా నడితే భాగస్వామిని హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘోరాలు నేరాలను చూస్తే.. సమాజం ఎటువెళ్తుందో అర్థం కావడటం లేదు. తాజాగా ప్రేమించి..పెళ్లి చేసుకున్న భార్యనే అతికిరాతకంగా హత్య చేశాడు ఓ కసాయి భర్త. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

రఘనాథపాలెం మండలం శివాయిగూడేనికి చెందిన మూడే వీరన్న టిప్పర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతడు ములకపల్లి మండలం పూసుగూడేనికి చెందిన ఆదిలక్ష్మి(26)ని ప్రేమించాడు. ఆమె వీరన్నకు సమీప బంధువు కావడంతో వారి పెళ్లికి పెద్దలు ఓకే చెప్పారు. అలా వీరన్న.. ఆదిలక్ష్మిని ప్రేమించి కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆదిలక్ష్మి  కూలీ పనులు చేస్తూ కుంటుంబానికి ఆర్థికంగా తోడు ఉంటున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ముగ్గురు పిల్లలు జన్మించారు. ఈ దంపతులకు ఒక కుమారుడు,  ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

పెళ్లైన తరువాత కొంతకాలం పాటు వీరి సంసారం ఎంతో హాయిగా సాగింది. అయితే అక్రమ సంబంధం వీరి కుటుంబంలో చిచ్చు పెట్టింది. కొంతకాలంగా శివాయిగూడేనికి చెందిన మహిళతో వీరన్న వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాక నాలుగు నెలల క్రితం ఆమెను తీసుకుని వెళ్లిపోయాడు. రెండు రోజుల క్రితమే గ్రామానికి తిరిగొచ్చిన వీరన్న.. తన భార్యతో మంచిగా ఉంటానని పెద్దలను నమ్మించాడు. దీంతో ఆదిలక్ష్మి కూడా భర్తను నమ్మి.. అతడి వద్దకు చేరింది. ఇదే సమయంలో ఆమె ఫోన్ మాట్లాడుతోందని వీరన్న అనుమానించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం పని నుంచి ఇంటికి వచ్చిన ఆదిలక్ష్మిపై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

ఇక భార్యను హత్య చేసిన అనంతరం ఆయన నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. స్థానికులు అందించిన సమాచారంలో ఏసీపీ హరికృష్ణ, ఇన్ స్పెక్టర్ శ్రీధర్ ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆదిలక్ష్మి మృతదేహాన్ని సర్వజనాసుపత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి బంధువులు రావడం ఆలస్యమైనందున కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలను  తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. ఏది ఏమైనప్పటికీ వివాహేతర సంబంధాలు, ఆర్థిక బంధాలు, ఇతర ఆవేశాల కారణంగా  చోటుచేసుకుంటున్నాయి. మరి.. ఇలాంటి దారుణానికి పాల్పడే వారికి ఎలాంటి శిక్ష విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis