iDreamPost
android-app
ios-app

ఆగని ఘోరాలు.. మణిపూర్ తరహాలో యువతిని వివస్త్రను చేసి..!

ఆగని ఘోరాలు.. మణిపూర్ తరహాలో యువతిని వివస్త్రను చేసి..!

మణిపూర్ లో ఇద్దరు మహిళలను వివస్త్రలుగా  చేసి.. ఊరంత తిప్పిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదే ఘటన పార్లమెంట్ లో పెద్ద రచ్చకు దారి తీసింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, డిమాండ్లు వస్తున్నాయి. అంతేకాక మన దేశం ఎటు వెళ్తుందంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మణిపూర్ మహిళల ఘటన గురించి అందరు చర్చించుకుంటున్న వేళ.. జార్ఖాండ్ లో అదే తరహాలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని నగ్నంగా చేసి.. చెట్టుకు కట్టేసి కొట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

జార్ఖండ్ రాష్ట్రం గిరిధిహ్ జిల్లాలోని సరియా పోలీస్ స్టేషన్ పరిధిలో 26 ఏళ్ల యువతి నివాసం ఉంటుంది. తమ కుమారుడిని ప్రేమించిందనే కోపంతో ఆ యువతిని నమ్మించి  యువకుడి కుటుంబం అడవిలోకి తీసుకెళ్లింది. ఆ తరువాత ఆమె బట్టలు ఊడదీసి..చితకబాదారు. అనంతరం చెట్టుకు కట్టేశారు. ఈ దారుణ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు యువతి వద్దకు చేరుకుని.. ఆమెను రక్షించారు. అనంతరం  ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ఈ ఘటన బుధవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది.  పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో  ఆ యువతి కొంత మంది పేర్లను చెప్పింది. బుధవారం రాత్రి తనను ఎవరో ఇంటి బయటి నుంచి పిలిచారని బాధితురాలు తెలిపింది. ఆ యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లి చూడగా ఇద్దరు యువకులు నిలబడి ఉన్నారు. యువకులిద్దరూ  ఆమెను బలవంతంగా బైక్‌పై కూర్చోబెట్టి ఇంటి నుంచి కిలోమీటరు దూరం ఉన్న అడవిలోకి తీసుకెళ్లారు. ఇక్కడ  ఆ యువతిని కొట్టి, బట్టలు చింపేసి యూకలిప్టస్ అనే చెట్టుకు కట్టేశారు. చెట్టుకు కట్టేసి ఉండటంతో ఆ రాత్రంతా యువతి.. అలానే ఉండి పోయింది.

ఉదయం మహిళను చెట్టుకు కట్టేసి ఉండడంతో స్థానికులు గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు మహిళను విడిపించారు. మహిళ స్థానిక దేవ్‌కీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువతిపై దాడిచేసిన ప్రియుడు, అతడి తండ్రి,తల్లి, సవతి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ కు తరలించారు. మరి.. ఈ దారుణ ఘటనకు పాల్పడిన వారికి ఎలాంటి శిక్ష విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అప్పు తీర్చలేదని మహిళపై అత్యాచారం.. ఫోన్ లో చిత్రీకరించి..

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş