iDreamPost
android-app
ios-app

భార్యపై కోపంతో కన్నకూతురిపై తండ్రి దారుణం!

  • Published Nov 30, 2023 | 4:14 PM Updated Updated Nov 30, 2023 | 4:14 PM

ఈ మధ్యకాలంలో బిడ్డలపై కన్నవారే దారుణలకు తెగబడుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలను హత్య చేస్తున్న మృగాళ్ల రూపంలో ఉన్న తండ్రులు కనిపిస్తున్నారు. తాజాగా ఓ కసాయి తండ్రి.. భార్యపై కోపంతో కన్న బిడ్డను పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేశాడు.

ఈ మధ్యకాలంలో బిడ్డలపై కన్నవారే దారుణలకు తెగబడుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలను హత్య చేస్తున్న మృగాళ్ల రూపంలో ఉన్న తండ్రులు కనిపిస్తున్నారు. తాజాగా ఓ కసాయి తండ్రి.. భార్యపై కోపంతో కన్న బిడ్డను పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేశాడు.

  • Published Nov 30, 2023 | 4:14 PMUpdated Nov 30, 2023 | 4:14 PM
భార్యపై కోపంతో కన్నకూతురిపై తండ్రి దారుణం!

కుటుంబంలో ప్రేమానుబంధాలు అనేవి సర్వసాధారణం. అయితే తల్లీకొడుకు, తండ్రీకూతుర్ల మధ్య ప్రత్యేక అనుబంధం ఉంటుంది. తండ్రి ఎప్పుడు కూతుర్లకే మద్దతుగా ఉంటాడు. బిడ్డలకు ఎలాంటి అవసరాలు వచ్చిన తండ్రి తీరుస్తుంటారు. అంతేకాక తన కూతుర్లకు ఏ చిన్న కష్టం వచ్చిన కన్నతండ్రి అల్లాడిపోతాడు. అయితే కొందరు తండ్రులు మాత్రం మృగాళ్ల మారిపోతున్నారు. కన్నబిడ్డల పాలిటే కాల యముళ్లుగా మారుతున్నారు.  కారణం ఏదైనా.. కన్న బిడ్డలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అంతేకాక వారిని అత్యంత దారుణంగా హత్య కూడా చేస్తున్నారు. తాజాగా రాజస్థాన్ లో అలాంటి  ఘోరం ఒకటి జరిగింది. కూతురిని పెట్రోల్ పోసి దహనం చేశాడు… ఓ కసాయి తండ్రి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రాజస్థాన్‌లోని పాలి కి చెందిన శివాలాల్  అనే వ్యక్తి ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. వివాహం నిమిత్తం పాలికి వచ్చిన తన కుమార్తై అయిన నిర్మా (32)ను గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం ఆపై ఆమె శరీరంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంగళవారం సాయంత్రం శివలాల్.. తన కుమార్తెపై అత్యంత పాశవికంగా దాడి చేసి హత్య చేశాడు. శివలాల్ గత 12 ఏళ్లుగా కుటుంబం నుంచి విడిగా ఉంటూ పాలి అనే టౌన్ లో నివాసం ఉంటున్నాడు. అతడి భార్య, పిల్లలు గుజరాత్ లో నివసిస్తున్నారు.

శివలాల్ కి తన భార్యకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలోనే భర్తపై  విరక్తి చెందిన ఆమె పిల్లలను తీసుకుని గుజరాత్ కి వెళ్లింది. ఇలా 12 ఏళ్ల పాటు భర్తకు దూరంగా పిల్లలను పెంచుకుంటూ ఆమె నివసిస్తున్నారు. అయితే ఇటీవల ఆ దంపతుల మధ్య మళ్లీ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే శివలాల్ భార్య పిల్లలు మంగళవారం రాజస్థాన్‌లోని పాలిలో జరిగిన వివాహ వేడుకలో హాజరయ్యేందుకు వచ్చారు. అదే వివాహానికి శివలాల్ కూడా హాజరయ్యాడు. ఈ వేడుకకు వచ్చిన తన కుమార్తెను మాట్లాడని పక్కకి పిలిచాడు.

అనంతరం ఆమెతో వాగ్వాదం జరిగింది. పధకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో నిర్మాను అత్యంత దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు.  అనంతరం ఆమె మృతదేహంపై పెట్రోల్ పోసి కాల్చేశాడు. కుమార్తె మరణవార్త తెలుసుకున్న మృతురాలి తల్లి గుండెలు పగిలేలా రోధించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక నిర్మను హత్య చేసిన నిందితుల కోసం గాలిస్తున్నారు. మరి.. కన్నబిడ్డలపైనే ఇలాంటి దారుణాలకు తెగబడుతున్న తండ్రులకు ఎలాంటి శిక్ష విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet