iDreamPost
android-app
ios-app

క్యాబ్ డ్రైవర్ తో ప్రేమ పెళ్లి.. చివరకు అతడు మాత్రం…!

  • Published Aug 30, 2024 | 4:30 AM Updated Updated Aug 30, 2024 | 4:30 AM

Karnataka Crime News: ఆ యువతి కొరియోగ్రాఫర్ గా పని చేస్తుంది. ఆమెకు క్యాబ్ డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు, అక్కడి నుంచి పెళ్లి వరకు సాగింది. క్యాబ్ డ్రైవర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె జీవితంలో ఘోరమైన విషాదం చోటుచేసుకుంది.

Karnataka Crime News: ఆ యువతి కొరియోగ్రాఫర్ గా పని చేస్తుంది. ఆమెకు క్యాబ్ డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు, అక్కడి నుంచి పెళ్లి వరకు సాగింది. క్యాబ్ డ్రైవర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె జీవితంలో ఘోరమైన విషాదం చోటుచేసుకుంది.

  • Published Aug 30, 2024 | 4:30 AMUpdated Aug 30, 2024 | 4:30 AM
క్యాబ్ డ్రైవర్ తో ప్రేమ పెళ్లి.. చివరకు అతడు మాత్రం…!

ప్రతి ఒక్కరు తమ దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా సాగాలని కోరుకుంటారు. అలానే చాలా మంది సంసార జీవితాలు హాయిగా సాగిపోతుంటాయి. మరికొందరు మాత్రం అనుమానం అనే పెనుభూతాన్ని ఇంట్లోకి తెచ్చుకుని కుటుంబాన్ని చీకట్లోకి నెట్టేసుకుంటారు. ఓ యువతి క్యాబ్ డ్రైవర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే అతడు అందమైన భార్య దొరికిందని సంతోష పడకా.. ఆమె జీవితాన్ని విషాదం చేశాడు. మరి.. ఈ ప్రేమ క్రైమ్ కథచిత్రమ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం…

కర్నాటక రాష్ట్రం బెళగావి ప్రాంతానికి చెందిన నవ్య శ్రీ(28)  సినిమాల్లో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా పని చేస్తుంది. ఆమెకు కిరణ్(31)అనే క్యాబ్ డ్రైవర్ తో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అతడి నవ్యశ్రీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈవీరు బెంగళురూలోని కెంగేరీ ప్రాంతంలోని విశ్వేశ్వర్య లే అవుట్ లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం నవ్య తన నివాసంలో విగతజీవిగా కనిపించింది. ఆమె స్నేహితురాలు ఐశ్వర్య వెళ్లి చూడగా నవ్య విగతజీవిగా కనిపించింది. రక్తపు మడుగులో పడి ఉన్న నవ్య శ్రీని చూసిన ఐశ్వర్య షాకి గురైంది. వెంటనే పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడి చేరుకున్నారు.

ఇక నవ్య మృతిపై ఆమె బాల్య స్నేహితురాలు ఐశ్వర్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవ్య భర్తే..ఆమెను హత్య చేశాడని ఫిర్యాదులే పేర్కొంది. గతంలో తనను కిరణ్ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని నవ్యవ పలుమార్లు తనతో చెప్పినట్లు ఆమె స్నేహితురాలు పోలీసులకు తెలిపింది.  సినిమా షూటింగ్స్ కారణంగా ఇంటికి  ఆలస్యంగా వస్తుండటంతో ..నవ్యపై ఆమె భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెకు వేరే వాళ్లతో అక్రమసంబంధం ఉందని భావించి తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే ఈ దారుణం జరిగినట్లు ఆమె బంధువులు, స్నేహితులు చెబుతున్నారు.

Young girl married cab driver

 మంగళవారం ఉదయం నవ్యశ్రీ ఐశ్వర్యకు ఫోన్ చేసి తనకు ప్రాణ హానీ ఉందని తెలిపినట్లు ఓ పోలీసు అధికారి అన్నారు. అదే రోజు సాయంత్రం నవ్యశ్రీ, ఆమె స్నేహితురాలు ఐశ్వర్య ఇంట్లో కలుసుకున్నారనని వారి ఫ్రెండ్ గిరీష్ చెప్పారు. ఈ క్రమంలో తన స్నేహితుల సాయంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భర్తపై ఫిర్యాదు చేసింది. అనంతరం రాత్రి 11.30 గంటలకు ఇంటికి చేరుకుని నవ్యశ్రీ ఇంటికి వచ్చి నిద్రకు ఉపక్రమించారు. బుధవారం ఉదయం రక్తపు మడుగులు విగత జీవితా కనిపించింది. కిరణ్ వద్ద తన ఇంటికి సంబంధించిన ఒక స్పేర్ కీ ఉందని, అతను ఇంట్లోకి ప్రవేశించి నవ్యను హత్య చేశాడని మృతురాలి బంధువులు, స్నేహితులు ఆరోపించారు. మొత్తానికి నిందితుడిని బెంగళారు పోలీసులు అరెస్టు చేశారు. క్యాబ్ డ్రైవర్ ను ప్రేమించిన నవ్య జీవితం చివరకు విషాదాంతమైంది. మరి..ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే.. ఏం చేయాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet