iDreamPost
android-app
ios-app

చిన్న కారణంతో రెండో భార్యపై భర్త దారుణం!

  • Published Apr 11, 2024 | 10:26 AM Updated Updated Apr 11, 2024 | 10:26 AM

వివాహబంధంతో ఒక్కటైన జంట ఒకరిపై ఒకరు నమ్మకంతో జీవించాలని పెద్దలు అంటారు. కానీ ఈ మధ్య కాలంలో క్షణిక సుఖం కోసం.. వివాహేతర సంబంధాల కొనసాగిస్తూ పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు.

వివాహబంధంతో ఒక్కటైన జంట ఒకరిపై ఒకరు నమ్మకంతో జీవించాలని పెద్దలు అంటారు. కానీ ఈ మధ్య కాలంలో క్షణిక సుఖం కోసం.. వివాహేతర సంబంధాల కొనసాగిస్తూ పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు.

  • Published Apr 11, 2024 | 10:26 AMUpdated Apr 11, 2024 | 10:26 AM
చిన్న కారణంతో రెండో భార్యపై భర్త దారుణం!

వివాహం అనేది పవిత్రమైన బంధం. ఈ బంధంలోకి అడుగు పెట్టిన మొదట్లో ఎంతో సుఖ సంతోషాలతో ఉంటున్నారు. కానీ కొద్ది కాలానికే భార్యభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు చివరికి విడాకులు తీసుకునే స్థాయికి వెళ్తుంది. ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కోల్పోతున్నారు. క్షణిక సుఖం కోసం వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ కారణంగా పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అంతేకాదు అక్రమ సంబంధాల నేపథ్యంలో భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది.  అక్రమ సంబంధం నేపథ్యంలో చిక్కబళ్లాపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరు రూరల్ జిల్లా హెస్కోట్ పట్టణంలో హరీశ్ కు పది సంవత్సరాల క్రితం మమత తో వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెడ్డిలక్ష్మి భర్త నుంచి విడాకులు తీసుకొని హరీశ్ ని రెండో పెళ్లి చేసుకుంది. తనకు అప్పటికే వివాహం జరిగిన విషయం హరీష్.. రెడ్డిలక్ష్మికి చెప్పలేదు. కొంత కాలంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో సహనం కోల్పోయిన హరీశ్ రెండో భార్య గొంతు నులిమి చంపాడు. ఆ తర్వాత కొనఊపిరితో ఉన్న ఆమెను కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. భయంతో ఇంటికి తాళం వేసి అక్కడ నుంచి మొదటి భార్య ఉన్న హూస్కోటే కు వెళ్లిపోయాడు.

తాను చేసిన నేరం మొత్తం మొదటి భార్య మమతతో చెప్పాడు హరీశ్. హత్య చేసి పోలీసుల నుంచి ఎప్పటికీ తప్పించుకోలేవని చెప్పింది మమత. ఈ క్రమంలోనే స్వయంగా తన భర్తను వెంటబెట్టుకొని హూసకోట్ పోలీసులకు అప్పగించింది. ఈ విషయం గురించి రెడ్డిలక్ష్మి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పెళ్లైన విషయం దాచి రెడ్డి లక్ష్మిని పెళ్లి చేసుకొని మోజు తీరిన తర్వాత ఆమెను చంపిన హరీశ్ కి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. చింతామణి నగర్ పోలీస్ స్టేషన్ లో నింధితుడు హరీష్ ని అదుపులోకి తీసుకొని విచారించగా.. తన మొదటి భార్య పిల్లలకు ఈ విషయం తెలిస్తే గొడవ చేస్తారన్న భయంతో రెండో భార్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet