iDreamPost
android-app
ios-app

అతనికి భార్యని ఎరగా వేసి మాస్టర్ ప్లాన్! ఇదెక్కడి భార్యరా బాబు?

  • Published Feb 09, 2024 | 6:00 PM Updated Updated Feb 09, 2024 | 6:00 PM

ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో ఎన్నో దారుణాలు వెలుగు చూస్తున్నాయి. తన భార్యని పావుగా వాడుకొని ఓ వ్యక్తిని హత్యచేసిన ఘటన సంచలనం రేపింది.

ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో ఎన్నో దారుణాలు వెలుగు చూస్తున్నాయి. తన భార్యని పావుగా వాడుకొని ఓ వ్యక్తిని హత్యచేసిన ఘటన సంచలనం రేపింది.

  • Published Feb 09, 2024 | 6:00 PMUpdated Feb 09, 2024 | 6:00 PM
అతనికి భార్యని ఎరగా వేసి మాస్టర్ ప్లాన్! ఇదెక్కడి భార్యరా బాబు?

ఇటీవల కాలంలో చాలా వరకు డబ్బు, అక్రమ సంబంధం వ్యవహారాల్లో దాడులు, హత్యలు జరగడం చూస్తూనే ఉన్నాం. భార్యాభర్తల మధ్య వివాహేతర సంబంధాల కారణంగా ఒకరినొకరు సుపారీ ఇచ్చి మరీ చంపుకుంటున్నారు. అక్రమ సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి.. పిల్లలను అనాథలను చేస్తున్నారు. కుటుంబాల్లో తీరని దుఖాఃన్ని మిగుల్చుతున్నారు. క్షణిక సుఖం కోసం బంగారు భవిష్యత్ ని నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధం ఓ లారీ డ్రైవర్ దారుణ హత్యకు దారి తీసింది. అతడి స్నేహితురాలు పక్కా ప్లాన్ తో ఈ దారుణానికి ఒడికట్టడం తీవ్రకలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరు చిక్కబళ్లాపూర్ జిల్లాలో గత శుక్రవారం తెల్లవారు జామున ఎస్‌కెఎ-43-ఎ-2678 టిప్పర్ లారీ డ్రైవర్ దేవగనహళ్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ (30) మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురయ్యాడు. హంతకులు.. మృతుడిన ఆటోలో తీసుకువెళ్లి నిర్జన ప్రాంతంలో నాటు తుపాకీలతో తల, ముఖం, మెడపై దారుణంగా దాడి చేసి చంపేశారు. ఈ హత్య కేసును చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. హత్య జరిగిన రోజు రాత్రి రూబియా అనే మహిళను అరెస్ట్ చేశారు. అనంతరం విచారణలో నిందితుడు ఏ1 నాగేంద్ర కుమార్ (27), కైసర్ పాషా (30) లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయాల్సి ఉంది. మృతుడు శ్రీనివాసులు, మంజుల మధ్య అక్రమ సంబంధమే హత్యకు కారణం అని ప్రాథమిక విచారణలో తేలిసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్‌, నాగేంద్రలకు మంజులతో అక్రమ సంబంధం ఉంది. నాగేంద్రతో మంజుల అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న శ్రీనివాస్ మంజులపై దాడి చేశాడు. మంజులపై జరిగిన దాడి గురించి నాగేంద్రకు తెలియజేయడంతో కోపంతో ఊగిపోయాడు.  శ్రీనివాస్ అడ్డు తొలిగించుకోవాలని నిర్ణయానికి వచ్చాడు నాగేంద్ర. ఈ క్రమంలోనే ప్రధాన నిందితుడు నాగేంద్ర తన స్నేహితులతో చేతులు కలిపి శ్రీనివాస్‌ను హత్య చేశాడు. ఇందుకు కోసం నాగేంద్ర స్నేహితుడైన కైసర్ పాషా భార్య రూబియాని పావుగా వాడుకున్నారు. శ్రీనివాస్ తో స్నేహం చేసి.. అతన్ని మాయమాటలతో మోసం చేసి నిర్జీవ ప్రదేశానికి వచ్చేలా చేసింది రూబీనా. అప్పటికే అక్కడ నాగేంద్ర, కైసర్ మారణాయుధాలతో కాచుకొని హత్య చేశారు’ అని బెంగళూరు రూరల్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ పురుషోత్తం తెలిపారు.కాగా, శ్రీనివాస్ నడుపుతున్న లారీ యజమాని మంజునాథ్ రెడ్డి మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు హత్యపై విచారణ ప్రారంభించారు. ఆ తర్వాత హత్య కేసు వెలుగులోకి వచ్చి నింధితులను పట్టుకున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom