iDreamPost
android-app
ios-app

బంధువుల పిల్లను ప్రేమించిన యువకుడు.. పెట్రోలు పోసి తగలబెట్టారు!

బంధువుల పిల్లను ప్రేమించిన యువకుడు.. పెట్రోలు పోసి తగలబెట్టారు!

ప్రేమ ఎంత అందమైన భావనో.. ఆ పేరు మీద జరిగే దారుణాలు అంతకంటే ఘోరంగా ఉంటున్నాయి. ఇష్టపడిన అమ్మాయి ఓకే చెప్పలేదని కొందరు.. తమకు ఇష్టంలేని అమ్మాయిని ప్రేమించాడని ఇంకొందరు.. తాము చూపించిన అమ్మాయి కాదన్నాడని మరికొందరు.. ఇలాంటి కారణాలతో ఎన్నో దాడులు, హత్యలు, దారుణాలు జరిగాయి. అలాంటి ఘోరాలు ఇంకా ఆగలేదనే చెప్పాలి. ఎందుకంటే తాజాగా ప్రేమకు సంబంధించి ఒక ఘోరం వెలుగు చూసింది. బంధువుల అమ్మాయిని ప్రేమించిన విద్యార్థిని పెట్రోలు పోసి తగలబెట్టారు.

శశాంక అనే కుర్రాడు బెంగళూరులోని రాజరాజేశ్వరీ నగర్ లో నివాసం ఉంటున్నాడు. అతను ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజ్ లో చదువుతున్నాడు. అయితే అతను అతని బంధువుల అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ విషయం నచ్చని అతని అంకుల్ ఒకాయన ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లు శశాంక్ తెలిపాడు. కుర్రాడిని తండ్రి ఉదయం 8 గంటలకు కాలేజ్  వద్ద దింపాడు. పిరియడ్స్ ఏమీ షెడ్యూల్ కాకపోవడంతో శశాంక ఇంటికి వెళ్లేందుకు బయల్దేరాడు.

అతను దొడ్డబేలే రోడ్డు వద్దకు రాగానే కొందరు ఇన్నోవా కారులో వచ్చి అతడిని బంలవంతంగా కారులోకి ఎక్కించినట్లు చెప్పాడు. వారిలో అతని అంకుల్ మను కూడా ఉన్నాడంట. శశాంక కళ్లకు గంతలు కట్టి అతడిపై దాడి చేసినట్లు తెలిపాడు. ఒక మైదనానికి తీసుకెళ్లి అతడిపై పెట్రోలు పోసి నిప్పంటించినట్లు ఆరోపించాడు. శశాంక నేలపై దొర్లుతూ మంటలను ఆర్పుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అతని బంధువు హీరాకు ఫోన్ చేసినట్లు చెప్పాడు. ఆమె శశాంక ఫ్రెండ్స్ ఇద్దరిని తీసుకుని ఘటనాస్థలానికి చేరుకుంది.

ఆ తర్వాత శశాంకను విక్టోరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ దాడిలో శశాంక శరీంర 80 శాతం వరకు కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రి వాళ్లు ఈ దాడి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిని మెడికో లీగల్ కేసుగా పరిగణించారు. కుంబలగోడు పోలీసులు శశాంక అంకుల్ మను, మరో ఆరుగిరిపై కేసు నమోదు చేశారు. వారిపై కిడ్నాప్, దాడి, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై హోమంత్రి పరమేశ్వర్ ఆరా తీశారు. ఘటనకు సంబంధించి నివేదికను కోరారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetPokerklasJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler