iDreamPost
android-app
ios-app

రీల్స్ బాగా చేస్తున్నాడని .. పెళ్లి చేసుకుంది! తరువాత ఏమైందంటే?

  • Published Jul 13, 2024 | 2:42 PM Updated Updated Jul 13, 2024 | 2:42 PM

Belagavi Crime News: ఈ మధ్య కాలాంలో చాలా మంది రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి తెగ తంటాలు పడుతున్నారు. కొంతమంది వీడియోలు వైరల్ కావడంతో రాత్రికి రాత్రే సెలబ్రెటీలు అవుతున్న విషయం తెలిసిందే.

Belagavi Crime News: ఈ మధ్య కాలాంలో చాలా మంది రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి తెగ తంటాలు పడుతున్నారు. కొంతమంది వీడియోలు వైరల్ కావడంతో రాత్రికి రాత్రే సెలబ్రెటీలు అవుతున్న విషయం తెలిసిందే.

  • Published Jul 13, 2024 | 2:42 PMUpdated Jul 13, 2024 | 2:42 PM
రీల్స్ బాగా చేస్తున్నాడని .. పెళ్లి చేసుకుంది! తరువాత ఏమైందంటే?

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా రీల్స్ చేస్తూ తమ లాటెంట్ చూపిస్తున్నారు. డ్యాన్స్, పాటలు పాడటం, వంటలు చేయడం, సాహసవంతమైన పనులు చేయడం ఇలా ఎన్నో రకాలుగా వీడియోలు, రీల్స్ చేస్తూ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నారు. గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఎదో ఒక రీల్ చేస్తూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరూ కలిసి రీల్స్ చేస్తూ హ్యాపీగా ఉన్న సమయంలో అనుకోని సంఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మైసూర్ లోని కుంబరకొప్పల్ కు చెందిన మంజుల అలియాస్ నయన(23) బెల్గాం తాలూకా మచ్చే గ్రామానికి చెందిన బోరేష్ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కొంత కాలానికి స్నేహంగా మారి ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దాంతో మంజుల తన తల్లిదండ్రులకు ఎదిరించి ఇల్లు వదిలి వచ్చింది బోరేష్ ని పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత కూతురు పెళ్లి చేసుకుందన్న విషయం తెలిసి కుటుంబ భ్యులు బెల్గాం చేరుకొని కూతురిని తిరిగి మైసూరుకు తీసుకువెళ్లింది. భర్తకు దూరంమై కొన్నిరోజుల వరకు మంజుల మనస్థాపానికి గురయ్యింది. ఈ క్రమంలోనే మంజులు మళ్లీ ఇంటి నుంచి వెళ్లి భర్తలో కలిసి కాపురం చేస్తుంది.

పెళ్లైన ఏడాదికి మంజుల నెల తప్పింది. ఆ విషయం భర్త, అత్తింటి వారికి నచ్చలేదు. ఆమెను అబార్షన్ చేయించుకోవాలని పట్టుబట్టారు. కానీ మంజుల మాత్రం ససేమిరా అంది. ఈ క్రమంలోనే మంజులకు భర్త కుటుంబ సభ్యులకు గొడవ మొదలైంది. అంతలోనే మంజుల శవమై కనిపించింది. కూతురు మరణించిన విషయం తెలిసిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. భర్త, అత్తా కలిసి తన కూతురికి ఊపిరి ఆడకుండా చేసి చంపారని తమ కూతురుని హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనా స్థలాన్ని డీసీపీ రోహన్ జగదీశ్ సందర్శించి పరిశీలించారు. బెళగావి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş