iDreamPost
android-app
ios-app

వీడు అసలు.. మనిషేనా! గర్భిణిగా ఉన్న భార్యను మంచానికి కట్టేసి..

  • Published Apr 21, 2024 | 1:17 PM Updated Updated Apr 21, 2024 | 1:17 PM

ఎన్నో ఆశలతో నవ వధువు అత్తవారింట్లోకి అడుగు పెడుతుంది. కానీ కొంతమంది భర్తల కొన్నిరోజుల్లోనే తమ నిజస్వరూపాన్ని బయట పెట్టి ఆడవాళ్లను హింసిస్తున్నారు.

ఎన్నో ఆశలతో నవ వధువు అత్తవారింట్లోకి అడుగు పెడుతుంది. కానీ కొంతమంది భర్తల కొన్నిరోజుల్లోనే తమ నిజస్వరూపాన్ని బయట పెట్టి ఆడవాళ్లను హింసిస్తున్నారు.

  • Published Apr 21, 2024 | 1:17 PMUpdated Apr 21, 2024 | 1:17 PM
వీడు అసలు.. మనిషేనా! గర్భిణిగా ఉన్న భార్యను మంచానికి కట్టేసి..

వివాహబంధంతో ఒక్కటైన జంటని నిండు నూరేళ్లు కలిసి ఉండాలని పెద్దలు, బంధుమిత్రులు దీవిస్తుంటారు. కానీ ఈ మధ్య పెళ్లైన కొంత కాలానికి ఎన్నో జంటలు అభిప్రాయ భేదాలతో విడిపోతున్నారు. చాలా వరకు ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, అక్రమ సంబంధాల వల్ల భార్యాభర్తల మధ్య తగాదాలు, గొడవలు జరగడం వల్ల విడిపోతున్నారని అంటున్నారు. కొంతమంది వరకట్నం సరిపోక.. అదనపు కట్నం తీసుకురావాలంటూ మహిళలను చిత్ర హింసలకు గురి చేస్తూ చంపేస్తున్నారు. ఇటాంటి ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. తన భార్య గర్భిణి అని కూడా చూడకుండా ఓ భర్త దుర్మార్గానికి తెగబడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అమృత్ సర్ లో ఘోర సంఘటన చోటు చేసుకుంది. గర్భవతి అయిన భార్యను ఓ భర్త అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం భార్యాభర్తల మధ్య చిన్న గొడవ చిలికి చిలికి గాలవానగా మారడంతో ఈ దారుణ ఘటనలకు పాల్పపడినట్లు తెలుస్తుంది. సుఖ్‌దేవ్, పింకీ (23) భార్యాభర్తలు. పెళ్లైన కొత్తలో ఈ జంట ఎంతో సంతోషంగా ఉండేవారు. ఇటీవల ఇద్దరి మధ్య తరుచూ గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం గొడవ జరగడంతో కోపోద్రిక్తుడైన సుఖ్‌దేవ్ గర్భవతి అని కూడా చూడకుండా పింకిని మంచానికి కట్టేసి నిప్పంటించి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత సుఖ్‌దేవ్ భయంతో అక్కడ నుంచి పరారయ్యాడు.

ఈ దారుణ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని భర్త సుఖ్‌దేవ్ కోసం గాలింపులు చేపట్టారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో జాతీయ మహిళా కమీషన్ తీవ్రంగా ఖండించింది. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను కోరింది. ఘటన అనంతరం పరారీలో ఉన్న సుఖ్‌దేవ్ ని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. ఈ కేసు పై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు అధికారు తెలిపారు.

Jojobet Girişİmajbetcasibomjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobet