iDreamPost
android-app
ios-app

భవ్యశ్రీ కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు!

  • Published Oct 12, 2023 | 6:42 PM Updated Updated Oct 12, 2023 | 6:42 PM
  • Published Oct 12, 2023 | 6:42 PMUpdated Oct 12, 2023 | 6:42 PM
భవ్యశ్రీ కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు!

చిత్తూరు జిల్లాలో ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతి కేసు ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం.. మా కూతురుని నలుగురు యువకులు తరుచు ప్రేమ పేరుతో వేధించేవాళ్లని, వాళ్లే మా అమ్మాయిని అత్యాచారం చేసి ఆ తర్వాత బావిలో పడేసి ఉంటారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఈ కేసులో భాగంగానే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారించారు. అయితే ఇన్నాళ్లు పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాకే అసలు నిజాలు తెలుస్తాయని పోలీసులు చెబుతూ వచ్చారు. ఆ రిపోర్టులు కూడా రావడంతో భవ్యశ్రీ మృతిపై అసలు నిజాలను బయటపెట్టారు.

భవ్యశ్రీ మృతిపై పోలీసులు ఏమన్నారంటే?

సంచలనం సృష్టించిన భవ్యశ్రీ మృతి కేసులో పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చాయి. దీన్ని ఆధారంగా చేసుకున్న పోలీసులు ఆ యువతి ఎలా చనిపోయిందనే విషయాన్ని చెప్పారు. భవ్యశ్రీది హత్య కాదని, ఆత్మహత్య అని పోలీసులు తేల్చారు. ఆ యువతిపై ఎటువంటి అత్యాచారం జరగలేదని, బావిలో దూకడం కారణంగానే ఊపిరాడక పోవడం వల్లే ఆ యువతి చనిపోయిందని పోలీసులు నిర్ధారించారు. ఆ అమ్మాయి ఒంటిపై లో దుస్తువులు లేవని తప్పుడు ప్రచారం చేశారు. ఇదిలా ఉంటే.. మృతదేహం నీటిలో కుల్లిపోవడం వల్లే ఆమె తలపై వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయాయని పోలీసులు తెలిపారు. మరో విషయం ఏంటంటే? ఆ యువతి కనిపించకుండాపోయిన రోజు ఇంట్లో గొడవ కూడా జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఆ యువతి ఆత్మహత్య గల కారణాల కోసం లోతైన విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ కేసులో అసలేం జరిగిందంటే?

సెప్టెంబర్ 17న భవ్యశ్రీ కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు మరుసటి రోజు పోలీసులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే భవ్యశ్రీ స్థానికంగా ఉండే ఓ బావిలో శవమై కనిపించింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కూతురి మృతిపై ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో ఏముందంటే? మా కూతురిని నలుగురు యువకులు తీసుకెళ్లి అత్యాచారం చేశారని, ఆ తర్వాత హత్య చేసి బావిలో పడేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే ఘటన ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş