iDreamPost
android-app
ios-app

ప్రేమ వివాహం.. పెళ్లై ఆరు నెలలే.. ఇంతలోనే తీవ్ర విషాదం!

  • Published Aug 08, 2023 | 11:10 AM Updated Updated Aug 08, 2023 | 11:10 AM
  • Published Aug 08, 2023 | 11:10 AMUpdated Aug 08, 2023 | 11:10 AM
ప్రేమ వివాహం.. పెళ్లై ఆరు నెలలే.. ఇంతలోనే తీవ్ర విషాదం!

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. పెళ్లై ఆరు నెలలు అవుతోంది. సంతోషంగా సాగుతున్న వారి కాపురంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఏం జరిగిందో తెలియదు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ దంపతులు.. రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నారు. మనసుపడ్డ వాడికిచ్చే వివాహం చేస్తే తమ బిడ్డ జీవితాంతం సంతోషంగా ఉంటుందని భావించి తల్లిదండ్రులు.. కుమార్తె చేసిన పనికి గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. మరి ఇంతకు ఏం జరిగింది.. పెళ్లై పట్టుమని ఏడాది కూడా గడవకముందే కొత్త జంట ఇంత దారుణ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.. వారికి వచ్చిన కష్టం ఏంటి అంటూ చర్చించుకుంటున్నారు బంధువులు. ఆ వివరాలు..

ఈ విషాద సంఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడిపత్రి మండలం చిన్నపోడమలకు చెందిన మంజునాథ్‌.. పుట్లూరు మండలం గరుగుచింతలపల్లికి చెందిన రమాదేవిలు గత కొంతకాలం నుంచి ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు కూడా బిడ్డల సంతోషమే తమకు ముఖ్యమని భావించి వారి పెళ్లికి అంగీకరించారు. దాంతో ఆరు నెలల క్రితమే వారికి వివాహం జరిగింది. పైళ్లైన దగ్గర నుంచి వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. సోమవారం రమాదేవి.. తాడిపత్రి మండలం చల్లవారిపల్లి దగ్గర రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది.

ఇక భార్య రమాదేవి ఆత్మహత్య గురించి తెలిసిన గంటల వ్యవధిలోనే భర్త మంజునాథ్‌.. చిన్నపోడమల సమీపోంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే వరకట్న వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని రమాదేవి తల్లిదండ్రులు ఆరోపించారు. ఇక గంటల వ్యవధిలోనే దంపతులు ఇలా ప్రాణాలు తీసుకోవడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న జంట.. పెళ్లైన ఆరు నెలలకే ఇలా ఆత్మహత్యకు పాల్పడటంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

marsbahis girişjojobet