iDreamPost
android-app
ios-app

విదేశాల్లో కొడుకు.. ఎవరూ లేని టైమ్ లో కోడలిపై మామ దారుణం!

  • Published Nov 11, 2023 | 1:09 PM Updated Updated Nov 11, 2023 | 1:09 PM

ఏపీలోని దారుణం చోటు చేసుకుంది. ఓ మామ కొడుకు లేని టైమ్ చూసి కోడలిపై దారుణానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

ఏపీలోని దారుణం చోటు చేసుకుంది. ఓ మామ కొడుకు లేని టైమ్ చూసి కోడలిపై దారుణానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

  • Published Nov 11, 2023 | 1:09 PMUpdated Nov 11, 2023 | 1:09 PM
విదేశాల్లో కొడుకు.. ఎవరూ లేని టైమ్ లో కోడలిపై మామ దారుణం!

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు ఇంట్లో లేని సమయం చూసి కోడలిపై మామ ఎవరూ ఊహించని కిరాతకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో స్థానికులు అంతా ఒక్కసారిగా షాక్ గరువుతున్నారు. ఆ మహిళ కుటుంబ సభ్యులు సైతం స్పందించి కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ కిరాతక ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే మామ కోడలపై చేసిన నేరాన్ని ఒప్పుకుని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని ఇచ్చాపురం మండలంలోని ఓ గ్రామంలో మోహన్ బాబు-మీనా కుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. అయితే మోహన్ బాబు ఉపాధి నిమిత్తం పోలాండ్ కు వెళ్లాడు. అప్పటి నుంచి మీనా కుమారి అత్తమామలు అన్నపూర్ణ, జగ్గారావుల వద్దే ఉంటుంది. చాలా కాలం పాటు అత్తమామలు ఆమెతో బాగానే ఉన్నట్లు నటించారు. కానీ, రోజులు గడిచే కొద్ది వారి అసలు రూపాన్ని బయట పెట్టారు. రోజూ కోడలు మీనా కుమారిని వేధిస్తూ ఉండేవారు. దీంతో తరుచు ఆ మహిళతో వాగ్వాదానికి దిగుతూ ఉండేవారు.

ఈ క్రమంలోనే అక్టోబర్ 8న సాయంత్రం మరోసారి వీరు ముగ్గురు గొడవ పడ్డారు. ఇక కొడుకు లేని టైమ్ చూసి అత్తమామలు కోడలని ఇష్టమొచ్చినట్లుగా మాటలతో దాడి చేశారు. ఈ క్రమంలో క్షణికావేశంలో ఊగిపోయిన ఆమె మామ జగ్గారావు.. ఇంట్లో ఉన్న కర్రతో కోడలు మీనా కుమారి తలపై బలంగా దాడి చేశాడు. ఇంతే కాకుండా దంపతులు ఇద్దరు కలిసి కోడలి గొంతు నులిమి అతి కిరాతకంగా హత్య చేశారు. ఆ తర్వాత అత్తమామలు మీనా కుమారే ఆత్మహత్య చేసుకున్నట్లు అత్తమామలు చిత్రకరించి అందరినీ నమ్మించారు. ఇదే విషయం మృతురాలి కుటుంబ సభ్యులకు తెలియడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని కూతురిని ఆ స్థితిలో చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. కూతురి మరణంపై మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని మీనా కుమారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి మేము దొరికిపోతామేమోనని మృతురాలి అత్తమామలు భయం భయంతో తిరుగుతూ ఉన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మాత్రం ఖచ్చితంగా ఇది హత్యగానే తేలుతుందని, ముందే ఒప్పుకుంటే పోతుందని జగ్గారావు, అన్నపూర్ణ భావించారు. ఇక ఇందులో భాగంగానే ఈ కేసు దర్యాప్తు ఉండగానే తాజాగా.. నిందితులు జగ్గారావు, అన్నపూర్ణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో పాటు మా కోడలిని మేమే హత్య చేశామని నేరాన్ని కూడా అంగీకరించారు.

దీంతో పోలీసులు ఆ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ విషయం బయటకు రావడంతో మృతురాలి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. జగ్గారావు, అన్నపూర్ణ దంపతులు చేసిన ఈ దారుణాన్ని గ్రామస్తులు నమ్మలేకపోతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. కొడుకు లేని టైమ్ చూసి కోడలు మీనా కుమారిని అతి దారుణంగా హత్య చేసిన జగ్గారావు, అన్నపూర్ణ దంపతుల కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibom