iDreamPost
android-app
ios-app

పచ్చని సంసారంలో చిచ్చు రేపిన అనుమానం!

  • Published Oct 31, 2023 | 2:59 PM Updated Updated Oct 31, 2023 | 2:59 PM

కొందరు దంపతులు ప్రతీ చిన్న విషయానికి గొడవ పడుతున్నారు. గోరుతో పోయేదాన్ని గొడ్డలి దాక తెచ్చుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మహిళ భర్తపై అనుమానం పడింది. చివరికి ఇదే అనుమానం సంసారంలో చిచ్చు రేపి వీరిని రోడ్డున పడేలా చేసింది.

కొందరు దంపతులు ప్రతీ చిన్న విషయానికి గొడవ పడుతున్నారు. గోరుతో పోయేదాన్ని గొడ్డలి దాక తెచ్చుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మహిళ భర్తపై అనుమానం పడింది. చివరికి ఇదే అనుమానం సంసారంలో చిచ్చు రేపి వీరిని రోడ్డున పడేలా చేసింది.

  • Published Oct 31, 2023 | 2:59 PMUpdated Oct 31, 2023 | 2:59 PM
పచ్చని సంసారంలో చిచ్చు రేపిన అనుమానం!

ఈ రోజుల్లో కొందరు దంపతులు ప్రతీ చిన్న విషయానికి గొడవ పడుతున్నారు. గోరుతో పోయేదాన్ని గొడ్డలి దాక తెచ్చుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మహిళ భర్తపై అనుమానం పడింది. చివరికి ఇదే అనుమానం సంసారంలో చిచ్చు రేపి వీరిని రోడ్డున పడేలా చేసింది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు ఈ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కుద్దిరాం గ్రామంలో నారాయణరావు-నవీన దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు 2020లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలానికి వీరికి ఓ కూతురు, కుమారుడు జన్మించారు. భర్త మొదట్లో ఎలక్ట్రిషన్ గా పని చేస్తూ ఆ తర్వాత స్థానికంగా సెక్యూరిటీగా గార్డుగా పని చేసేవాడు. అయితే గత కొంత కాలం నుంచి వీరు రామప్పుడు దిబ్బవరంలో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. నారాయణరావు ఓ షాపింగ్ మాల్ లో సేల్స్ మేన్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలోనే భర్త నారాయణరావు తీరుపై భార్య నవీనకు అనుమానం ఉండేది. ఇదే విషయంపై భార్యాభర్తలు తరుచు గొడవ పడేవారు. ఆదివారం రాత్రి ఈ దంపతులు మరోసారి గొడవ పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు.

ఇక అదే రోజు రాత్రి భార్య నవీన మరో ఇంట్లో పడుకున్నట్లు నటించి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన భర్త స్థానికుల సాయంతో తలుపులు బద్దలు కొట్టి ఆమెను కిందకు దించారు. ఆ తర్వాత నవీనను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. ఈ మహిళ అప్పటికే మరణించిందని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకుని మృతురాలి తల్లిదండ్రులు, భర్త కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం నవీన కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. భర్త తీరుపై అనుమానంతో ఆత్మహత్య చేసుకున్న నవీన్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş