iDreamPost
android-app
ios-app

పెళ్లై ఆరు నెలలు కాలేదు.. అంతలోనే..!

  • Published Oct 10, 2023 | 3:04 PM Updated Updated Oct 10, 2023 | 3:04 PM
  • Published Oct 10, 2023 | 3:04 PMUpdated Oct 10, 2023 | 3:04 PM
పెళ్లై ఆరు నెలలు కాలేదు.. అంతలోనే..!

ఈ అమ్మాయి పేరు అశ్విని. గత ఆరు నెలల కిందటే ఆమె తల్లిదండ్రులు మెళియాపుట్టి మండలానికి చెందిన ఓ యువకుడికి ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కట్ చేస్తే.. సోమవారం అశ్విని ఇంట్లో ఊహించని స్థితిలో కనిపించింది. ఆమె కుటుంబ సభ్యులు ఏం జరిగిందంటూ నెత్తినోరు బాదుకున్నారు. ఆ తర్వాత చేసేదేంలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశ్వినికి ఇలా జరగడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అసలేం జరిగింటే?

పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టిలోని పురుశరాంపురం గ్రామానికి చెందిన జన్ని కృష్ణారావుకి, పొగడవెళ్లి గ్రామానికి చెందిన అశ్విని (23) అనే యువతిని ఇచ్చి ఆమె తల్లిదండ్రులు మార్చిలో వివాహం జరిపించారు. అయితే అప్పటి నుంచి ఈ దంపతులు సంతోషంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇదలా ఉంటే.. సోమవారం అశ్విని బహిర్భూమికని గ్రామంలోని శివారు ప్రాంతానికి వెళ్లి కొద్దిసేపటికి తిరిగి ఇంటికి వచ్చింది. ఇక వస్తు వస్తూనే ఆ వివాహిత నోట్లో నుంచి నురగలు కక్కి అపస్మారక స్థితిలో పడిపోయింది.

ఆమె కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ, మార్గమధ్యంలోనే ఆ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. కూతురి మరణవార్త తెలుసుకుని ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో అశ్విని మృతదేహాన్ని పరిశీలించి ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş