iDreamPost
android-app
ios-app

ఒక్కగానొక్క కూతురు.. స్నానం చేసేందుకు బాత్రూమ్ కు వెళ్లి..!

ఒక్కగానొక్క కూతురు.. స్నానం చేసేందుకు బాత్రూమ్ కు వెళ్లి..!

ఒక్కగానొకొక్క కూతురు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఇక కుమార్తెను బాగా చదివించి గొప్ప ప్రయోజకురాలిని చేసి, ఆ తర్వాత ఓ మంచి యువకుడితో ఘనంగా వివాహం చేయాలని ఎన్నో కలలు కన్నారు. కానీ, ఆ కలలు చివరికి కలలుగానే మిగిలిపోయాయి. అప్పటి వరకు కళ్లముందే హుషారుగా ఆడిపాడిన కూతురికి ఉన్నట్టుండి ఇలా జరిగిపోవడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో హనుమంత రెడ్డి-పుష్పలత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక్కగానొక్క కూతురు నిఖితా రెడ్డి (15) ఉంది. ఈమె స్థానిక స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. ఈ బాలిక చదువుల్లో కూడా చురుగ్గా ఉండేది. ఇదిలా ఉంటే.. మంగళవారం ఉదయం నిఖితా రెడ్డి స్నానం చేసేందుకు బాత్రూమ్ కు వెళ్లింది. ఆ తర్వాత అందులో ఉన్న ట్యాబ్ ను పట్టుకోగానే ఉన్నట్టుండి కరెంట్ షాక్ కొట్టింది.

ఈ ప్రమాదంలో ఆ బాలిక అదే బాత్రూమ్ లో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. అయితే, ఇంట్లో షార్క్యూట్ కారణంగా ఆ ట్యాబ్ కు కరెంట్ సరఫరా జరగడంతో ఆ బాలిక కరెంట్ షాక్ తో చనిపోయినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: మట్టి కింద యువతి శరీరం.. అంతా మిస్టరీయే!

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibomjojobet güncel girişjojobet giriş