iDreamPost
android-app
ios-app

అమాయకంగా కనిపించే షణ్ముఖ్ ఇలాంటోడా?

  • Published Feb 22, 2024 | 2:10 PM Updated Updated Feb 22, 2024 | 2:50 PM

యూట్యూబర్, బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ గంజాయి సేవిస్తూ హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. మౌనిక అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చిన్న చేప కోసం వల వేస్తే..పెద్ద తిమింగళలమే పడింది.

యూట్యూబర్, బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ గంజాయి సేవిస్తూ హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. మౌనిక అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చిన్న చేప కోసం వల వేస్తే..పెద్ద తిమింగళలమే పడింది.

  • Published Feb 22, 2024 | 2:10 PMUpdated Feb 22, 2024 | 2:50 PM
అమాయకంగా కనిపించే షణ్ముఖ్ ఇలాంటోడా?

‘అరే ఏంట్రా ఇది’ ఈ డైలాగ్‌ వింటే చాలు.. ఠక్కున గుర్తుకు వచ్చే పేరు షణ్ముఖ్. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా అతడికి అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, స్పెషల్ సాంగ్స్‌తో బాయ్స్ నెక్ట్ డోర్ అనిపించుకున్నాడు. కానీ అనూహ్యంగా డ్రగ్ కేసులో పోలీసులకు పట్టుబడి వార్తల్లో నిలిచాడు. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సంపత్ కోసం వెళ్లిన పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు షన్ను. గంజాయి తీసుకుంటుండగా..అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. డాక్టర్ మౌనిక అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖాకీలు చిన్న చేప కోసం వల వేస్తే..పెద్ద తిమింగళలమే పడింది.

వైజాగ్‌కు చెందిన షణ్ముఖ్ జస్వంత్ కండ్రేగుల.. చదువు అంతా అక్కడే సాగింది. ఆ తర్వాత యూట్యూబ్‌లో వైవా అనే కామెడీ షార్ట్ ఫిల్మిం ద్వారా యాక్టింగ్‌లోకి అడుగుపెట్టాడు. అక్కడ నుండి వరుసగా పలు షార్ట్ ఫిలింస్ చేశాడు. కానీ అతడిని ఓవర్ నైట్ స్టార్ చేసింది మాత్రం.. సాఫ్ట్ వేర్ డెవలపర్. సూర్య వెబ్ సిరీస్ తో షన్ను క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బిగ్ బాస్ 5లో అడుగుపెట్టి.. రన్నరప్ కూడా అయ్యాడు. ఆహా వేదికగా ఓ వెబ్ సిరీస్ మూవీ చేశాడు. జాను, అయ్యయ్యో అంటూ స్పెషల్ సాంగ్స్ చేసి అభిమానుల్ని అలరించాడు కూడా. తాజాగా స్టూడెంట్ వెబ్ సిరీస్ చేయగా.. విపరీతంగా ఆకట్టుకుంది. అందులో కూడా సోషల్ మెసేజ్ ఉంటుంది.

వెబ్ సిరీస్ ద్వారా మంచి చెప్పే అయ్యగారు.. ఇప్పుడు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు. అదీ కూడా సోదరుడిని విచారించేందుకు వెళితే.. అడ్డంగా దొరికిపోయాడు షన్ను. షన్ను సోదరుడు సంపత్ సంపత్ వినయ్‌కి డాక్టర్ మౌనిక అనే యువతితో 2021లో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆరు రోజుల్లో పెళ్లి ఉంది అనగా.. మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీంతో మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో విస్తుపోయే విషయాలు వెల్లడించింది. షన్ను యూట్యూబ్ ఛానల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ మోసం చేశాడని పేర్కొంది. అలాగే సోదరుడు సంపత్ వినయ్.. ప్రేమ పెళ్లి అంటూ మోసం చేయడంతో పాటు తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఒకసారి అబార్షన్ కూడా చేయించాడంటూ కంప్లయింట్‌లో పేర్కొంది.

కాగా, సోదరుడు సంపత్ వినయ్ కోసం అతడి ఫ్లాట్‌కు వెళ్లారు పోలీసులు. అంతలో అక్కడే ఉన్న షణ్ముఖ్ జస్వంత్ గంజాయి తీసుకుంటూ.. పోలీసులకు చిక్కాడు. పోలీసుల రాకతో అన్నాదమ్ములిద్దరూ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అంతలో షన్ను గంజాయి తీసుకుంటుండగా.. మౌనిక వీడియోలు తీస్తుండగా.. ఆమెతో తీయోద్దంటూ గొడవపడ్డాడు. అంతలో పోలీసులు గమనించి.. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఒకరి కోసం వెళితే.. మరొకరు దొరికిపోయారు. ఇద్దరిపై వేర్వేరు కేసులు నమోదు చేశారు పోలీసులు. యూట్యూబ్ వెబ్ సిరీస్సుల్లో అమాయకంగా ఉంటూ.. నీతులు చెప్పే షణ్ముఖ్.. నిజ జీవితంలో గంజాయి లాంటి మత్తు పదార్ధాలకు అలవాడు పడ్డాడు.  ఛాన్సులు పేరు చెప్పి అమ్మాయిలను మోసం చేస్తున్నాడు.

Jojobet Girişbetparken çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetcasibomjojobetinterbahisjojobetMadridbetMadridbetMadridbetjojobetJojobetkavbetjojobetgrandpashabetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet giriş