iDreamPost
android-app
ios-app

గంజాయి కేసులో షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్

  • Published Feb 22, 2024 | 11:22 AM Updated Updated Feb 22, 2024 | 2:58 PM

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్, ఆయన సోదరుడు సంపత్ వినయ్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్, ఆయన సోదరుడు సంపత్ వినయ్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

  • Published Feb 22, 2024 | 11:22 AMUpdated Feb 22, 2024 | 2:58 PM
గంజాయి కేసులో షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్, ఆయన సోదరుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్ కేసులో షణ్ముఖ్, అమ్మాయిని మోసం చేసిన కేసులో ఆయన సోదరుడు సంపత్ వినయ్‌ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ మౌనిక అనే యువతిని మోసం చేసి.. మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు షణ్ముఖ్ సోదరుడు సంపత్. ఆరు రోజుల్లో తనతో పెళ్లి అనగా.. మరో యువతిని వివాహం చేసుకోవడంతో మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడి ప్రశ్నించేందుకు ఫ్లాట్‌కు వెళ్లగా..అక్కడ షణ్ముఖ్ గంజాయి తీసుకుంటూ దొరికిపోయాడు. మౌనిక వీడియో తీస్తుండగా.. డ్రగ్స్ మత్తులో ఉన్న షణ్ముఖ్ వీడియో తీయోద్దంటూ వాదన చేశాడు.

షణ్ముఖ్, సంపత్‌లను పోలీసులు అరెస్టు చేసి.. వేర్వేరు కేసులు నమోదు చేశారు. కాగా, షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది తొలిసారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో అరెస్టు అయ్యి.. విడుదలయ్యాడు. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి విముక్తి పొందాడు. యూట్యూబ్ వీడియోలతో సెలబ్రిటీగా మారాడు షణ్ముఖ్. సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరిస్‌తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపు అతడ్ని బిగ్ బాస్ 5లోకి ఎంటర్ అయ్యేలా చేసింది. చివరి వరకు అతడే విన్నర్ అనునకున్నారంతా.. కానీ మరో కంటెస్టెంట్, యూట్యూబర్, ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ సిరి హన్మంత్‌తో ఓవర్ చేయడంతో.. అతడ్ని పక్కన పెట్టి..సన్నీని గెలిపించారు.

బిగ్ బాస్ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల అతడి ప్రేమ కూడా బెడిసి కొట్టింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దీప్తి సునైనా అతడి ప్రేమకు బ్రేకప్ చెప్పేసింది. బయటకు వచ్చాక.. ఏజెంట్ సాయి సంతోష్ అనే మూవీ వెబ్ సిరీస్ మూవీ చేయగా.. అది ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంట్‌గా స్టూడెంట్ వెబ్ సిరీస్‌తో మెప్పించాడు. ప్రముఖ కమెడియన్ వైవా హర్ష చిత్రం సుందరం మాష్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా సందడి చేశాడు. డ్యాన్స్ చేసి అదరగొట్టాడు. ఇంతలోనే ఊహించని విధంగా పోలీసులకు దొరికిపోయాడు. ప్రస్తుతం షన్ను, అతడి సోదరుడు పోలీసుల అదుపులో ఉన్నారు.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetCasibomHoliganbetHoliganbetCasibomcasibomjojobetdeneme bonusu veren sitelerjojobetMadridbetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetgrandpashabetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet giriş