iDreamPost
android-app
ios-app

దారుణం: బలవంతంగా యువతి నుదిటిన సింధూరం పెట్టాడని..

  • Published Sep 19, 2023 | 9:42 PM Updated Updated Sep 19, 2023 | 9:42 PM
  • Published Sep 19, 2023 | 9:42 PMUpdated Sep 19, 2023 | 9:42 PM
దారుణం: బలవంతంగా యువతి నుదిటిన సింధూరం పెట్టాడని..

యువతి నుదిటిన బలవంతంగా సింధూరం పెట్టాడన్న కోపంతో ఓ యువకుడ్ని దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. ప్రేమ పేరుతో కూతుర్ని వేధిస్తున్నాడన్న కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సినిమా రేంజ్‌లో మర్డర్‌ ప్లాన్‌ వేసి మరీ యువకుడ్ని చంపాడు. ఈ సంఘటన షాద్‌నగరలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధికి చెందిన కరుణాకర్‌ అదే ప్రాంతానికి చెందిన యువతిని వన్‌సైడ్‌గా ప్రేమిస్తున్నాడు. తనను ప్రేమించమంటూ గతకొద్ది రోజులుగా ఆమె వెంటపడుతున్నాడు.

కొద్దిరోజుల క్రితం యువతి నుదిటిన బలవంతంగా సింధూరం పెట్టాడు. ఆమె ఈవిషయం తండ్రి రంజిత్‌ కుమార్‌కు చెప్పింది. కరుణాకర్‌ తన కూతురికి సింధూరం పెట్టిన విషయం బయటకు తెలిస్తే.. పరువు పోతుందని రంజిత్‌ కుమార్‌ భావించాడు. ఎలాగైనా కరుణాకర్‌ను చంపాలని భావించాడు. పక్కా ప్లాన్‌ వేశాడు. ఆగస్టు 15వ తేదీనాడు కరుణాకర్‌ను జూలపల్లి వెళ్లే రోడ్డులో ఉన్న వరి చేను దగ్గరకు పిలిపించుకున్నాడు. అక్కడికి రాగానే విచక్షణా రహితంగా దాడి చేశాడు.

రంజిత్‌ కుమార్‌తో పాటు మరికొంతమంది కరుణాకర్‌ చేతులు, కాళ్లు కట్టేశారు. తర్వాత అతడ్ని బురదలోకి నొక్కి.. ఊపిరాడకుండా చేసి చంపారు. అదే బురదలో పాతిపెట్టి పోయారు. మిస్సింగ్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో రంజిత్‌ కుమార్‌ దారుణాలు బయటపడ్డాయి. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడికి సహకరించిన వారిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet