iDreamPost
android-app
ios-app

ఆమెకు భర్త కన్న ప్రియుడే ముఖ్యం.. ఎంతకు తెగించిందంటే?

  • Published Jul 21, 2023 | 4:17 PM Updated Updated Jul 21, 2023 | 4:17 PM
  • Published Jul 21, 2023 | 4:17 PMUpdated Jul 21, 2023 | 4:17 PM
ఆమెకు భర్త కన్న ప్రియుడే ముఖ్యం.. ఎంతకు తెగించిందంటే?

ఈ రోజల్లో కొంతమంది మహిళలు పెళ్లై ఇంట్లో భర్త ఉన్నా.. చాలదన్నట్లుగా పరాయి వాడితో సరసాలకు సై అంటున్నారు. ఇక భర్తకు తెలియకుండా సీక్రెట్ కాపురాన్ని నడిపిస్తూ ప్రియుడితో సుఖాన్ని పొందుతున్నారు. ఇక కాదు, కూడదని ఎవరైనా అడ్డుచెబితే వారిని అంతమొందించడానికి కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డిలో కొట్టగొల్ల తుక్కప్ప (55)-ఈశ్వరమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. కాగా, భార్యాభర్తలు స్థానికంగా కూలీనాలీ పనులు చేస్తూ సంసారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈశ్వరమ్మ శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అలా వీరి అక్రమ సంబంధం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లుగా వర్దిల్లుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈశ్వరమ్మ ప్రియుడితో గడిపేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది.

దీంతో ప్రియుడితో చేతులు కలిపి తన భర్త తుక్కప్పను ప్రాణాలతో లేకుండా చేయాలని ప్లాన్ గీసింది. దీనికి ఆమె ప్రియుడు కూడా సరేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీరి పథకం ప్రకారమే.. తుక్కప్ప అనారోగ్యం ఉండడంతో భర్తను నమ్మించి భార్య ఇటీవల మేడ్చల్ జిల్లాలో ఉన్న కౌకూర్ దర్గాకు తీసుకెళ్లింది. అక్కడికి వెళ్లాక వైద్యుడు అందుబాటులో లేడని భర్తకు నచ్చజెప్పింది. అయితే తుక్కప్పకు రోజూ మద్యం తాగే అలవాటు ఉంది. దీన్నే ఆసరాగా చేసుకున్న ఈశ్వరమ్మ.. ప్రియుడు శ్రీనివాస్ తెచ్చిన పురుగుల మందును ఓసీ కోటర్ బాటిల్ లో కలిపి భర్తకు తాగించింది. ఇది తాగిన ఆమె భర్త కొద్దిసేపటికే తీవ్ర అస్వాస్థతకు లోనయ్యాడు.

ఇక ఏం తెలియనట్టు ఈశ్వరమ్మ భర్తను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఫలితం లేకపోవడంతో భర్త అప్పటికే ప్రాణాలు విడిచాడు. అనంతరం వైద్యులు తుక్కప్ప మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించడంతో అసలు విషయం బయట పడింది. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించింది.ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ పరిశీలించి మృతుడి భార్యను విచారించారు. ఇక నోట్లో నీళ్లు నమిలిన ఈశ్వరమ్మ అసలు నిజాన్ని పోలీసులకు వివరించింది. దీంతో పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwoongrandpashabetcasibomcasibomcasibombetcio giriş