iDreamPost
android-app
ios-app

HYD మెహదీపట్నంలో ఆర్టీసీ బస్సు చోరీ..

చిన్న చిన్న దొంగతనాలు చేస్తే కడుపు నింపుకోవచ్చునని, కాసులు రావని అనుకుంటున్నారేమో ఏమో.. పెద్ద పెద్ద వస్తువులే ఎసరు పెడుతున్నారు దొంగలు. ఒక్కసారే సెటిల్ అయిపోవచ్చుననుకుని ప్రభుత్వ సొమ్ముకే కన్నం వేస్తున్నారు. తాజాగా వింత దొంగతనం ఒకటి వెలుగు చూసింది.

చిన్న చిన్న దొంగతనాలు చేస్తే కడుపు నింపుకోవచ్చునని, కాసులు రావని అనుకుంటున్నారేమో ఏమో.. పెద్ద పెద్ద వస్తువులే ఎసరు పెడుతున్నారు దొంగలు. ఒక్కసారే సెటిల్ అయిపోవచ్చుననుకుని ప్రభుత్వ సొమ్ముకే కన్నం వేస్తున్నారు. తాజాగా వింత దొంగతనం ఒకటి వెలుగు చూసింది.

HYD మెహదీపట్నంలో ఆర్టీసీ బస్సు చోరీ..

కాదేదీ కవితకు అనర్హం అన్న పదాన్ని.. దొంగిలించడానికి కూడా వర్తింపజేసుకుంటున్నారు దొంగలు. అర్దరాత్రుళ్లు ఇంట్లోకి చొరబడి.. చేతికి దొరికినదంతా దోచుకెళ్లే రోజులు పోయాయి. సమయంతో పని లేదు. అందరూ చూస్తుండగానే దోపిడీలు చేసేస్తున్నారు. మహిళల మెడలో ఉన్న నగలు, పర్సులు, మగవాళ్ల జేబులకు చిల్లులు పెట్టి డబ్బులు దోచేస్తున్నారు. ఇవే కాదూ బైకులు, సెల్ ఫోన్స్, మొబైల్ టవర్స్, బస్ స్టాపులను, రైలు పట్టాలను కూడా దొంగిలించిన సంఘటనల గురించి విన్నాం, చదివాం. కానీ ఏకంగా బస్సునే ఎత్తుకెళ్లిపోయి ఘటన చర్చనీయాంశమైంది. ఈ దొంగతనం మరెక్కడో కాదూ తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో ఈ భారీ వాహన చోరీ జరిగింది.

బస్సు డిపో ముందు నిలిపి ఉంచిన బస్సును ఎత్తుకెళ్లారు దొంగ/దొంగలు. గత నెల 30వ తేదీ అనగా సోమవారం రాత్రి.. హైదరాబాద్‌లోని మెహదీ పట్నం బస్ డిపో వద్ద ఈ చోరీ జరిగింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ సోమవారం రాత్రి డ్యూటీ దిగే సమయంలో అనగా 10.30 గంటలకు మెహదీ పట్నం బస్ డిపో మందు వాహనాన్ని నిలిపి వెళ్లాడు. తిరిగి ఉదయం డ్యూటీ ఎక్కేందుకు బస్సు పార్క్ చేసిన ప్రాంతానికి రాగా, వాహనం కనిపించలేదు. చుట్టు ప్రక్కల వారిని ప్రశ్నించాడు. తోటి డ్రైవర్లను అడిగినా ఫలితం లేకపోవడంతో.. డిపో మొత్తం గాలించారు. అయినా బస్సు కనిపించకపోవడంతో.. ఎవరో బస్సును ఎత్తికెళ్లారని గుర్తించి.. డిపోలో సమాచారం అందించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు కేసు నమోదు చేసి మెహదీ పట్నం పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించారు. విచారణ అనంతరం తుండవల్లి, శంషాబాద్ లో పోలీసులు బస్సును గుర్తించారు. అయితే దీన్ని అక్కడకు ఎవరూ తీసుకెళ్లారా అని విచారిస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. సెప్టెంబర్ నెలలో సిద్దిపేటలో ప్రయాణీకులు ఉండగానే.. ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లి.. అందరికీ షాకిచ్చాడు ఓ దొంగ. ఆ వార్త అప్పుడు వైరల్ గా నిలిచిన సంగతి విదితమే. ఇప్పుడు అలాంటి సంఘటన మరోటి వెలుగుచూసింది.