iDreamPost
android-app
ios-app

ఇంట్లో పేలిన రాకెట్ లాంచర్.. 9 మంది మృతి!

  • Published Sep 28, 2023 | 12:35 PM Updated Updated Sep 28, 2023 | 12:35 PM
  • Published Sep 28, 2023 | 12:35 PMUpdated Sep 28, 2023 | 12:35 PM
ఇంట్లో పేలిన రాకెట్ లాంచర్.. 9 మంది మృతి!

ఇటీవల ప్రమాదాలు ఏరూపంలో ముంచుకు వస్తున్నాయో ఎవరూ ఊహించలేకపోతున్నారు. నిన్న ఇరాక్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. ఎంతో ఆనందంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని వందకు పైగా మరణించారు.. వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా ఓ ఇంట్లో రాకెట్ లాంచర్ పేలి తీరని విషాదం మిగిల్చింది. వివరాల్లోకి వెళితే..

పాకిస్థాన్ లోని సింధ ప్రావిన్స్ కి చెందిన కాంధ్ కోట్ లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. పిల్లలు ఆడుకుంటున్న రాకెట్ లాంచర్ పేలిపోయింది. దీంతో అక్కడ ఆడుకుంటున్న నలుగురు చిన్నారుల సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిల్లలు గ్రౌండ్ లో ఆడుకుంటున్న సమయంలో వారికి ఒక రాకెట్ లాంచర్ దొరికింది. ఆటవస్తువు అనుకొని పిల్లలు దాన్ని తీసుకొని ఇంటికి వెళ్లారు. రాకెట్ లాంచర్ తో ఆడుకోవడం మొదలు పెట్టారు.

ఈ క్రమంలోనే రాకెట్ లాంచర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అక్కడే ఆడుకుంటున్న ఐదుగురు పిల్లలు, ఇద్దరు మహిళలతో సహా తొమ్మింది మంది చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమీప నదీ ప్రాంతంలో ఉండే డెకాయిట్ లు ఈ రాకెట్ లాంచర్ దాచి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దాన్ని తెలియక పిల్లలు తెచ్చుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet günceldeneme bonusu veren sitelerjojobetMadridbetMadridbetJojobetnakitbahisJojobetjojobetjojobetgrandpashabetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetbetciojojobetcasibomJojobet