iDreamPost
android-app
ios-app

Shanmukh Jaswanth: గంజాయి కేసులో షణ్ముఖ్‌కు ఊరట.. స్టేషన్ నుండి విడుదల

  • Published Feb 23, 2024 | 1:03 PM Updated Updated Feb 23, 2024 | 1:07 PM

గంజాయి కేసులో హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డ ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా స్టార్, బిగ్ బాస్ 5 రన్నర్.. షణ్ముఖ్ జస్వంత్ కు ఊరట లభించింది.

గంజాయి కేసులో హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డ ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా స్టార్, బిగ్ బాస్ 5 రన్నర్.. షణ్ముఖ్ జస్వంత్ కు ఊరట లభించింది.

  • Published Feb 23, 2024 | 1:03 PMUpdated Feb 23, 2024 | 1:07 PM
Shanmukh Jaswanth: గంజాయి కేసులో షణ్ముఖ్‌కు ఊరట.. స్టేషన్ నుండి విడుదల

గంజాయి కేసులో యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి విదితమే. విజయవాడకు చెందిన డాక్టర్ మౌనిక అనే యువతి.. షణ్ముఖ్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ తనను మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. ఈ కంప్లయింట్‌పై విచారణ చేపట్టిన పోలీసులు వినయ్ ఫ్లాట్‌కు వెళ్లగా.. అక్కడ గంజాయి సేవిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు షన్ను. అన్నాదమ్ములిద్దర్ని అదుపులోకి తీసుకుని.. వేర్వేరు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. షన్ను గంజాయి తీసుకుంటూ దొరికిపోవడంతో నమ్మలేని స్థితిలో ఉన్నారు అతడి ఫ్యాన్స్. అయితే ఈ కేసును టేకప్ చేశారు ప్రముఖ లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర.

తాజా సమాచారం ప్రకారం.. గంజాయి కేసులో షణ్ముఖ్ జస్వంత్‌కు ఊరట లభించింది. అతడికి బెయిల్ మంజూరు అయ్యింది.  షన్ను పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు బయటకు వచ్చాయి. అతడ్ని విడిపించి తీసుకు వచ్చారు లాయర్ కళ్యాణ్ సుంకర. ఇదిలా ఉంటే.. ఈ కేసు టేకప్ చేసే సమయంలో ‘మీడియాలో వస్తున్న కథనాలకు, నా క్లంయింట్ కు ఎలాంటి సంబంధం లేదు. షన్ను నాకు మూడు సంవత్సరాల నుండి తెలుసు. వాళ్ల నాన్న నా దగ్గరే ఉన్నారు. ఈ కేసు నేను హ్యాండిల్ చేస్తున్నా’ అంటూ ప్రకటించారు కళ్యాణ్. ఇప్పుడు షణ్ముఖ్ ను పోలీస్ స్టేషన్ నుండి విడిపించి తీసుకు వచ్చారు కళ్యాణ్.

కాగా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఎంతో పాపులర్ అయ్యాడు షణ్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్ను. అరే ఏంట్రా ఇది అనే డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు. వైవా అనే కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న షన్ను.. ఆ తర్వాత షార్ట్ ఫిల్మింస్, వెబ్ సిరీస్ ద్వారా సెలబ్రిటీ హోదాను సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ 5లోకి ఎంటరై.. అందరికీ  సుపరిచితమయ్యాడు. ఆ సీజన్ రన్నరప్ గా నిలిచాడు. హౌస్ నుండి బయటకు వచ్చాక.. ఓటీటీ వేదికగా ఓ వెబ్ సిరీస్ చేసి అలరించాడు. జాను, అయ్యోయ్యో అంటూ ప్రైవేట్ ఆల్బమ్స్‌లో నటించాడు. తాజాగా స్టూడెంట్ అనే వెబ్ సిరీస్ యూట్యూబ్‌లో సందడి చేసిన సంగతి విదితమే.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet