iDreamPost
android-app
ios-app

భర్తను కాదని ప్రియుడితో సహజీవనం.. నమ్మిన ప్రియుడే..!

  • Published Jul 26, 2023 | 6:54 PM Updated Updated Jul 26, 2023 | 7:14 PM
  • Published Jul 26, 2023 | 6:54 PMUpdated Jul 26, 2023 | 7:14 PM
భర్తను కాదని ప్రియుడితో సహజీవనం.. నమ్మిన ప్రియుడే..!

ఈమె పేరు గుమ్మడి నిర్మలమ్మ, వయసు 36 ఏళ్లు. చాలా ఏళ్ల కిందటే ఎల్లయ్య అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కూతురు కూడా పుట్టింది. అలా వీరి సంసారం సంతోషంగా కొన్నాళ్లు కొనసాగింది. కట్ చేస్తే.. నిర్మలమ్మ కట్టుకున్న భర్తను వదిలి మరో వ్యక్తితో సహజీవనం చేయడం మొదలు పెట్టింది. వీరి చీకటి కాపురం కూడా చాలా కాలంగా కొనసాగుతూ వచ్చింది. అయితే, నిర్మలమ్మ ఉన్నట్టుండి తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం ఆగిర్యాలలో గుమ్మడి ఎల్లయ్య-నిర్మలమ్మ (36) దంపతులు నివాసం ఉండేవారు. వీరికి చాలా ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కూతురు జన్మించింది. ఇక పుట్టిన కూతురుని చూసుకుంటూ ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. అలా వీరి కాపురం సాఫీగా సాగుతున్న తరుణంలోనే నిర్మలమ్మ భర్తకు దూరంగా జరిగి ఒంటరిగా కాపురం పెట్టింది. ఈ క్రమంలోనే ఆమెకు జిల్లాలోని తలకొండపల్లి గ్రామానికి చెందిన రవీందర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.

వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి గత కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. ఇకపోతే.. కొన్ని రోజుల నుంచి రవీందర్ ప్రియురాలు నిర్మలమ్మతో మాట్లాడకపోవడం, దూరం పెట్టడం చేశాడని తెలుస్తుంది. అతినికి ఫోన్ చేసి కలవాలని కోరింది. దీనికి రవీందర్ నిరాకరించినట్లు సమాచారం. దీంతో నిర్మలమ్మ తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇదిలా ఉంటే.. ఈ నెల 25న నిర్మలమ్మ ప్రియుడు రవీందర్ ను కలిసి నన్ను ఎందుకు దూరం పెడుతున్నావంటూ ప్రశ్నించింది.

ఇదే విషయమై ఇద్దరు గొడవ పడ్డారు. అదే రోజు నిర్మలమ్మ ప్రియుడికి ఫోన్ చేసి.. నేను చనిపోతున్నాను అంటూ గ్రామ సమీపంలో ఉన్న ఓ వాగులో దూకింది. స్థానికులు అప్రమత్తమై ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ, అదే వాగులో ఆమె కొట్టుకుపోయింది. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిర్మలమ్మ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: వీడిన సింధు హత్య మిస్టరీ! ఆమెను చంపింది ఎవరో కాదు..!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet