iDreamPost
android-app
ios-app

అత్తారింటికి వచ్చి బావిలో శవమై తేలిన యువకుడు! ఈ క్రైమ్ స్టోరీ ఏం జరిగిందంటే?

  • Published Oct 04, 2023 | 6:38 PM Updated Updated Oct 04, 2023 | 6:38 PM
  • Published Oct 04, 2023 | 6:38 PMUpdated Oct 04, 2023 | 6:38 PM
అత్తారింటికి వచ్చి బావిలో శవమై తేలిన యువకుడు! ఈ క్రైమ్ స్టోరీ ఏం జరిగిందంటే?

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు అత్తిరింటికి వచ్చి అదే ఊరిలోని ఓ బావిలో శవమై కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురై కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన గణేష్, రేవళ్లికి చెందిన రజితకు గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. అయితే బతుకుదెరువు కోసం గతంలో ఈ దంపతులు ముంబై వెళ్లారు. అక్కడే పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. చేతికి గాయం కావడంతో నొప్పి తగ్గాక తిరిగొస్తానని గణేష్ భార్యకు చెప్పి సెప్టెంబర్ 2న అత్తగారి ఊరైన రేవళ్లికి వెళ్లాడు. అయితే అప్పటి నుంచి గణేష్ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 10న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలోనే అదే ఊరిలో ఉన్న ఓ బావిలో తల లేని మొండంతో ఓ యువకుడి శవమై కనిపించింది. గ్రామస్తులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అతని ప్యాంట్ జేబులో ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా అది గణేష్ మృతదేహమే అని అతని కుటుంబ సభ్యులు గుర్తించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు గణేష్ ను ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారు? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio