iDreamPost
android-app
ios-app

విషాదం: యూట్యూబ్ లో చూస్తూ ఉరేసుకుని బాలుడు ఆత్మహత్య!

  • Published Jul 25, 2023 | 8:45 PM Updated Updated Jul 25, 2023 | 8:50 PM
  • Published Jul 25, 2023 | 8:45 PMUpdated Jul 25, 2023 | 8:50 PM
విషాదం: యూట్యూబ్ లో చూస్తూ ఉరేసుకుని బాలుడు ఆత్మహత్య!

యూట్యూబ్ లో చూస్తూ ఉరేసుకుని బాలుడు ఆత్మహత్య. వినటానికి భయంగా ఉన్న ఇది నిజం. ఆ బాలుడి కుటుంబ సభ్యులు గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా.. గోడకు ఉన్న మేకుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కృష్ణ నాయక్ తండాలో ఉదయ్ అనే బాలుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటూ స్థానికంగా చదువుకుంటున్నాడు. అయితే, ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఆ బాలుడు ఇటీవల యూట్యూబ్ లో చూస్తూ ఇంట్లో ఉన్న ఓ మేకుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయం అతడి కుటుంబ సభ్యులకు తెలియడంతో వెంటనే ఇంటికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టి చూడగా.. అప్పటికే ఉదయ్  మేకుకు వాలాడుతూ కనిపించాడు.

దీంతో వెంటనే అతని తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. ఆ బాలుడు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇదే ఘటనతో స్థానికులు అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అనంతరం ఆ బాలుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: సింధు మృతిపై వీడని మిస్టరీ! అసలేం జరిగింది?

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom