iDreamPost
android-app
ios-app

గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు.. కానీ..!

  • Published Nov 23, 2023 | 9:08 AM Updated Updated Nov 23, 2023 | 9:08 AM

పైన కనిపిస్తున్న ఇద్దరు ప్రేమికులు. చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ, అంతలోనే ఊహించని నిర్ణయం తీసుకున్నారు.

పైన కనిపిస్తున్న ఇద్దరు ప్రేమికులు. చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ, అంతలోనే ఊహించని నిర్ణయం తీసుకున్నారు.

  • Published Nov 23, 2023 | 9:08 AMUpdated Nov 23, 2023 | 9:08 AM
గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు.. కానీ..!

ఈ రోజుల్లో కొందరు చదువుకునే యువతి, యువకులు తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడుతున్నారు. ఇక అదే జీవితమని బతికేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చదువు పేరుతో బయటకు వెళ్తూ సినిమాలు, షికారులకు వెళ్తున్నారు. ఇక చివరికి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నారు. కానీ, వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించకపోవడంతో వారిని ఎదురించి మరీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక పెద్దలు ఒప్పుకోకుంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఓ ప్రేమ జంట.. పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకు ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకున్నారా? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా తుంగళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో సామల లక్ష్మీ నారాయణ-ఇందిర దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి శ్రీధర్ అనే కుమారుడు ఉన్నాడు. ఇతడు స్థానికంగా ఓ కాలేజీలో ఐటీఐ చదువుతున్నాడు. అయితే, శ్రీధర్ కు వీరి ఇంటి పక్కనే ఉన్న సంధ్య (17) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త చివరికి ఇద్దిర మధ్య ప్రేమగా మారింది. అలా చాలా కాలం నుంచి వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు.

ఇక కొంత కాలానికి వీరి ప్రేమ వ్యవహారం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారిని మందలించారు. పెళ్లికి కూడా నిరాకరించారు. దీంతో ఈ ప్రేమికులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించి ఈ ప్రేమికులు రెండు రోజల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఉన్నట్టుండి ఇద్దరూ కనిపించకపోవడంతో అంతటా వెతికారు. యువతి కుటుంబ సభ్యులు ఖంగారుపడి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే ఈ ప్రేమికులు బుధవారం మామిడిపల్లి-కనగర్తి గ్రామల మధ్య ఉన్న ఓ వాగులో శవాలై కనిపించారు. ఈ సీన్ చూసి స్థానికులు షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి మృతదేహాలను వెలికి తీశారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని ఫిర్యాదు చేసిన యువతి కుటంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకుని చనిపోయిన సంధ్యను చూసి ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీధర్ కుటుంబ సభ్యులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. అనంతరం పోలీసులు ఆ మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుమకున్నాయి. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్న ఈ ప్రేమ జంట నిర్ణయంపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet