iDreamPost
android-app
ios-app

కూతురితో కలిసి భర్తను చంపిన భార్య! ఎందుకో తెలుసా?

  • Published Nov 08, 2023 | 1:01 PM Updated Updated Nov 08, 2023 | 1:01 PM

కూతురితో కలిసి భర్తను చంపిన భార్య. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఇంతకు ఆ మహిళ తన కూతురితో కలిసి భర్తను ఎందుకు హత్య చేసిందో తెలుసా?

కూతురితో కలిసి భర్తను చంపిన భార్య. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఇంతకు ఆ మహిళ తన కూతురితో కలిసి భర్తను ఎందుకు హత్య చేసిందో తెలుసా?

  • Published Nov 08, 2023 | 1:01 PMUpdated Nov 08, 2023 | 1:01 PM
కూతురితో కలిసి భర్తను చంపిన భార్య! ఎందుకో తెలుసా?

ఈ మధ్య సమాజంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఏకంగా కట్టుకున్నవాళ్లను కన్నవారితో కలిసి అతి కిరాతకంగా హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. వీటిని మరువకముందే అచ్చం ఇలాంటిదే తెలంగాణలో చోటు చేసుకుంది. ఓ మహిళ తన కూతురితో చేతులు కలిపి తాళి కట్టిన భర్తను ప్రాణాలతో లేకుండా చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు భార్య కట్టుకున్న భర్తను తన కూతురితో కలిసి ఎందుకు హత్య చేసింది? మరీ ఇంత దారుణం చేయడానికి కారణం ఏంటి? అసలు ఈ క్రైమ్ స్టోరీలో ఏం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శివనగర్ లో లేచర్ల ప్రకాశ్ రావు (44)-స్వప్న దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఉషశ్రీ అనే కూతురు కూడా ఉంది. కొన్నాళ్ల పాటు ఈ దంపతులు చెరో చోట పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అలా చాలా కాలం పాటు ఈ భార్యాభర్తలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు దరి చేరకుండా సంతోషంగా జీవించారు. కానీ, రాను రాను ప్రకాశ్ రావు దారి తప్పి వక్రమార్గంలోకి వెళ్లాడు. అసలు విషయం ఏంటంటే? ప్రకాశ్ రావు గత కొంత కాలం నుంచి భార్య, కూతురుని పట్టించుకోకుండా తాగుడుకు బానిసై జల్సాలకు అలవాటు పడ్డట్లు సమాచారం. ఇంతే కాకుండా స్థానికంగా ఉండే కొందరి మహిళలతో వివాహేతర సంబంధాలు కూడా కొనసాగించినట్లు తెలుస్తుంది.

ఇక ఇదే విషయం భార్య స్వప్నకు తెలియడంతో ఈ పద్దతి మంచిది కాదని, బుద్ది మార్చుకోవాలంటూ అనేక సార్లు భర్తకు సూచించింది. కానీ, ప్రకాశ్ రావు భార్య మాటను అస్సలు లెక్క చేయకుండా తాగుతూ మహిళల వెంట తిరిగేవాడు. స్వప్న భర్తకు చెప్పి చెప్పి అలసిపోయింది. ఇలా అయితే కాదని భావించిన ఈ మహిళ.. భర్తను హత్య చేయాల్సిందే అని అనుకుంది. ఇందు కోసం ఏకంగా తన కూతురి సాయాన్ని కూడా కోరింది. తండ్రి వ్యవహారాలతో విసిగిపోయిన కూతురు ఉషశ్రీ కూడా తల్లి మాటను కాదనలేక సరే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఈ నెల 1న భర్త ప్రకాశ్ రావు హత్యకు పథకం రచించారు. ఆ రోజు అతడు ఫుల్ గా మద్యం తాగి ఇంటికొచ్చాడు. ఇదే మంచి సమయం అనుకున్న స్వప్న.. భర్త నిద్రపోయింది చూసి వెంటనే తన కూతురితో కలిసి భర్త వద్దకు వెళ్లింది. ఇక ఉషశ్రీ తండ్రి ముఖంపై దిండుతో బిగించి పట్టుకుంది. వెంటనే స్వప్న కూరగాయలు కట్ చేసే కత్తితో భర్తపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు.

ఆ తర్వాత భర్త మృతదేహాన్ని గొడ్డలితో ముక్కలు ముక్కలు చేసి ఎక్కడైన విసిరేయాలని అనుకున్నారు. కానీ, అది కుదరలేదు. ఇంట్లోనే పాతిపెట్టాలని భావించారు. అది కూడా వర్కౌట్ కాలేదు. దీంతో ఈ నెల 3న భర్త మృతదహాన్ని కాల్చి వేయాలని అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ, మంటలు ఎగిసిపడి దుర్వాసన వస్తుందని మళ్లీ వెనకడుగు వేశారు. ఇవన్నీ కాకుండా సహజంగానే అతడు మరించినట్లుగా సీన్ క్రియేట్ చేశారు. ఇక మరసటి రోజు ఇదే విషయాన్ని ఉషశ్రీ తన చిన్నాన్నకు నిద్రలోనే నాన్న చనిపోయాడని చెప్పింది. ఇది విని అతడు షాక్ గురయ్యాడు. ఇక వారి బంధువులకు సమాచారం ఇవ్వడంతో అంతా వచ్చారు. ఆస్సలు ఆలస్యం చేయకుండా స్వప్న భర్త దహన సంస్కారాలు చేసి చేతులు దులుపుకుంది.

కానీ, వీరుంటున్న ఇంట్లో నుంచి విపరీతమైన దుర్వాసన వచ్చింది. వెంటనే మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకుని అంతా పరిశీలించారు. ఎందుకో అనుమానం వచ్చి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు స్వప్నను అన్ని కోణాల్లో విచారించగా.. సమాధానాలు చెప్పలేక నోట్లో నీళ్లు నమిలింది. ఇక చివరికి అసలు విషయం బయటపడడంతో పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. భర్త తాగుడుకు బానిసై, మహిళలతో వివాహేతర సంబంధాలు కొనిసాగిస్తున్నాడని భర్తను ప్రాణాలతో లేకుండా చేసిన స్వప్న దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom