iDreamPost
android-app
ios-app

20 రోజులక్రితం కొడుకు పుట్టాడు.. ఊహించని విధంగా హోటల్‌ గదిలో..

  • Published Dec 15, 2023 | 1:27 PM Updated Updated Dec 15, 2023 | 1:27 PM

భర్తను నమ్మి ఆమె ఊరికి వందల కిలోమీటర్ల దూరం ఉన్న చోటుకి వచ్చింది. అయితే, భర్తతో పాటు ఓ హోటల్‌ గదిలో ఉంటోంది. అయితే, ఊహించని విధంగా ఆమె జీవితం ముగిసింది.

భర్తను నమ్మి ఆమె ఊరికి వందల కిలోమీటర్ల దూరం ఉన్న చోటుకి వచ్చింది. అయితే, భర్తతో పాటు ఓ హోటల్‌ గదిలో ఉంటోంది. అయితే, ఊహించని విధంగా ఆమె జీవితం ముగిసింది.

  • Published Dec 15, 2023 | 1:27 PMUpdated Dec 15, 2023 | 1:27 PM
20 రోజులక్రితం కొడుకు పుట్టాడు.. ఊహించని విధంగా హోటల్‌ గదిలో..

పెళ్లి తర్వాత భర్త.. భార్య ప్రపంచం అవుతాడు. మూడు ముళ్లు వేసిన భర్త పక్కనుంటే చాలు అనుకుంటుంది ఏ భార్య అయినా.. బాధ కలిగినా.. సంతోషం వేసినా భర్తకు చెప్పుకుంటుంది. అలాంటి భర్తలే భార్యల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారు. ఆ నిర్లక్ష్యమే కొన్ని సార్లు భారీ మూల్యాన్ని కోరుతోంది. భార్యల ప్రాణాలు తీస్తోంది. తాజాగా, ఓ నిండు చూలాలు కడుపునొప్పితో బాధపడుతూ ఉంది. విషయం భర్తకు చెప్పింది. భర్త భార్య బాధను పట్టించుకోలేదు. క్రికేట్‌ చూడడానికి వెళ్లాడు.

భర్త ఇంటికి తిరిగి వచ్చే సమయానికి భార్య విగతజీవిగా కనిపించింది. ఈ సంఘటన కర్ణాటకలోని రాయచూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని నాగల్‌ బరి జిల్లాకు చెందిన అవినాష్‌ కర్ణాటకలోని రాయచూరు నగరంలో ఉన్న సంతోష్‌ సరోవర్‌ హోటల్‌లో పని చేస్తున్నాడు. ఇతడికి సంవత్సరం క్రితం ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సోనీతో పెళ్లయింది. పెళ్లయిన తర్వాత సోనీ భర్తతో పాటు రాయచూరు వచ్చేసింది. ఇ‍ద్దరూ ఆ సంతోష్‌ సరోవర్‌ హోటల్‌లోని రూమ్‌ నెంబర్‌ 113లో నివాసం ఉంటున్నారు.

స్వీట్లు తయారు చేస్తూ జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో గర్భవతి అయిన సోనీ 20 రోజుల క్రితం ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అవినాష్‌ సంతోషం పట్టలేకపోయాడు. హోటల్‌ స్టాఫ్‌కు పార్టీ ఇచ్చాడు. 20 రోజుల గడిచాయి. సిజరియేన్‌ కారణంగా సోనీ కడుపు దగ్గర నొప్పితో బాధపడుతూ ఉంది. ఈ విషయాన్ని తరచుగా భర్తకు చెబుతూ వస్తోంది. అయితే, అవినాష్‌ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. బుధవారం సోనీ తీవ్రమైన నొప్పితో ఇబ్బందిపడుతూ ఉంది. ఈ విషయాన్ని భర్తకు చెప్పింది.

అతడు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లలేదు సరికదా.. క్రికేట్‌ చూడ్డానికి వెళ్లిపోయాడు. నొప్పి భరించలేకపోయిన సోనీ ఓ దారుణమైన నిర్ణయం తీసుకుంది. బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా.. హోటల్‌ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అవినాష్‌ రూముకు వచ్చేసరికి సోనీ విగత జీవిగా కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సోనీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు.

హత్యా లేక ఆత్మహత్యా అన్న కోణం విచారణ చేపట్టారు. సోనీ భర్త అవినాష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ అభంశుభం తెలియని బాబు పాలిట శాపంగా మారింది. తల్లిలేని వాడయ్యాడు. తండ్రి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. మరి, ఈ క్రైమ్‌ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom