iDreamPost
android-app
ios-app

కొడుకు చేసిన పనికి.. తల్లిని అర్ధనగ్నంగా ఊరేగించిన అత్తింటివాళ్లు..

  • Published Apr 07, 2024 | 1:36 PM Updated Updated Apr 07, 2024 | 1:36 PM

సమాజంలో అమానవీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మానవ సంబంధాలు, విలువల కోల్పోతుంది సొసైటీ. కొడుకు చేసిన పనికి తల్లిని ఘోరంగా శిక్షించారు అతడి అత్తింటి వారు.

సమాజంలో అమానవీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మానవ సంబంధాలు, విలువల కోల్పోతుంది సొసైటీ. కొడుకు చేసిన పనికి తల్లిని ఘోరంగా శిక్షించారు అతడి అత్తింటి వారు.

  • Published Apr 07, 2024 | 1:36 PMUpdated Apr 07, 2024 | 1:36 PM
కొడుకు చేసిన పనికి.. తల్లిని అర్ధనగ్నంగా ఊరేగించిన అత్తింటివాళ్లు..

మానవ సంబంధాలు రోజు రోజుకూ కుంచించుకుపోతున్నాయి. ఒకరు చేసిన తప్పుకు మరొకరు బలౌతున్నారు. వీటికి కారణమౌతున్నాయి అక్రమ, వివాహేతర సంబంధాలు. తమ సుఖం కోసం చూసుకుంటున్నారే తప్ప.. దీని వల్ల ఫ్యామిలీ సఫర్ అవుతుందని, ఇబ్బందికి గురౌతుందని ఆలోచించడం లేదు. కుటుంబ బాధ్యతలకు, బంధాలకు తిలోదకాలు ఇచ్చి పరాయి స్త్రీ పంచన చేరుతున్నారు. దీంతో వారు చేసిన తప్పులకు తల్లిదండ్రులు, కట్టుకున్న జీవిత భాగస్వామి, కడుపున పుట్టిన బిడ్డలు బలౌతున్నారు. తాజాగా పంజాబ్‌లో కొడుకు చేసిన తప్పుకు తల్లికి శిక్ష వేసింది అత్తారింటి కుటుంబం.

పంజాబ్‌లోని తరన్ తరణ్ జిల్లాలో దారుణం జరిగింది. కొడుకు చేసిన పనికి తల్లిపై దాడి చేసి అర్థనగ్నంగా ఊరేగించారు అతడి అత్తామామలు. కుమారుడికి ఓ అమ్మాయితో పెళ్లి కావాల్సి ఉండగా.. అతడు మరో మహిళతో పారిపోయి.. పెద్దలకు విరుద్ధంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దీంతో పిల్లనిచ్చే తల్లిదండ్రులు వీరావేశంలో తల్లి దగ్గరకు వెళ్లి. ఆమెపై దాడి చేసి.. అర్థనగ్నంగా తిప్పారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవతున్నాయి. కాగా, ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాధితురాలు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి.

తన కుమారుడికి గత నెలలో ఒక మహిళతో తన వివాహాన్ని నిశ్చయం చేశాం. పెళ్లి విషయంలో వధువు కుటుంబ సభ్యుల మధ్య పొసగలేదు. దీంతో తన పుత్రుడు ఓ మహిళను తీసుకొని వెళ్లిపోయాడు. ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంపై కోపంతో ఊగిపోయిన అతడి అత్తారింటి వాళ్లు.. ఇంటిపై దాడి చేసి.. తన బట్టలు చించి అర్థనగ్నంగా ఊరేగించారని పేర్కొంది. ఐదుగురు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఐదుగురిలో నలుగుర్ని అరెస్టు చేశామని తెలిపారు పోలీసులు. ఐపీసీలోని సెక్షన్ 354, 354బి, 354డి, 323, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. చివరకు కొడుకు చేసిన తప్పుకు బాధితురాలు అయ్యింది తల్లి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet