iDreamPost
android-app
ios-app

మరీ ఇంత దారుణమా.. భార్య జుట్టు పట్టి నడిరోడ్డుపై..

  • Published Sep 27, 2023 | 3:39 PM Updated Updated Sep 27, 2023 | 3:39 PM
  • Published Sep 27, 2023 | 3:39 PMUpdated Sep 27, 2023 | 3:39 PM
మరీ ఇంత దారుణమా.. భార్య జుట్టు పట్టి నడిరోడ్డుపై..

21వ శతాబ్ధంలోనూ ఆడవారిపై అరాచకాలు ఆగటం లేదు. భార్యలను వేధిస్తున్న భర్తలు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నారు. తాజాగా, పంజాబ్‌లో ఓ దారుణమైన సంఘటన వెలుగుచూసింది. అదనపు కట్నం కోసం ఓ భర్త.. భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. కట్నం తీసుకురాకుండా పుట్టింటికి వెళ్లిందని ఆమెను చావ బాదాడు. ఆమె జుట్టు పట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. అందరూ చూస్తుండగానే ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే..

పంజాబ్‌, గురుదాస్‌పూర్‌లోని చోదియాన్‌ గ్రామానికి చెందిన మీను అనే యువతికి కొన్నేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి పెళ్లయింది. పెళ్లయిన కొన్ని నెలలు వీరి కాపురం బాగానే సాగింది. అయితే, తర్వాతినుంచి గొడవలు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం భర్త మీను వేధించేవాడు. నిత్యం బాగా కొట్టేవాడు. భర్త వేధింపులు తాళలేకపోయిన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, తన మాట వినకుండా పుట్టింటికి వెళ్లిపోయిందని భర్త ఆమెపై పగ పెంచుకున్నాడు.

తాజాగా ఆమె ఇంటికి వెళ్లాడు. మీనుతో గొడవపెట్టుకున్నాడు. ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. అనంతరం ఆమె జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు. భర్త దాడిలో మీను తీవ్రంగా గాయపడింది. మీను తల్లి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మీను తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet