iDreamPost
android-app
ios-app

బర్త్‌డేకు గిఫ్ట్‌ ఇవ్వలేదని భర్తను గుద్ది చంపేసిన భార్య!

తాజాగా పుణెలో చోటుచేసుకున్న ఓ సంఘటన పెళ్లి చేసుకోవాలనుకునే వారిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఓ మహిళ తన భర్తను ఒక్క గుద్దుతో చంపేసింది. ఈ సంఘటనతో...

తాజాగా పుణెలో చోటుచేసుకున్న ఓ సంఘటన పెళ్లి చేసుకోవాలనుకునే వారిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఓ మహిళ తన భర్తను ఒక్క గుద్దుతో చంపేసింది. ఈ సంఘటనతో...

బర్త్‌డేకు గిఫ్ట్‌ ఇవ్వలేదని భర్తను గుద్ది చంపేసిన భార్య!

వైవాహిక బంధంలో అలకలు, కోపాలు ఉండడం సహజం. ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో భార్యా భర్తల మధ్య మనస్పర్థలు రావడం అనేది సర్వ సాధారణమైన విషయం అయిపోయింది. అయితే, అలాంటి మనస్పర్థల వల్ల విడిపోయిన జంటలను చూసి ఉంటాం. లేదా, సర్దుకు పోయి కలిసుండే జంటలను చూసి ఉంటాం. కానీ, కేవలం తను అడిగిన చిన్న కోరిక తీర్చలేదని భర్తపై దాడి చేసిన భార్య ఉందంటే నమ్మగలరా!. అవును, తాజాగా మహారాష్ట్రలో జరిగిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తన పుట్టిన రోజు వేడుకకు దుబాయ్ తీసుకువెళ్లలేదని.. ఆగ్రహంతో భార్య తన భర్త పైన దాడికి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త మరణించాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదొక వాస్తవ సంఘటన. ఈ విషాదం శుక్రవారం పూణేలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..

నిఖిల్ ఖన్నా(36), రేణుక(33) భార్యా భర్తలు. పూణె, వానావిడి ప్రాంతంలో ఒక రెసిడెన్షియల్ సొసైటీలోని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ ఆరేళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. నిఖిల్ ఖన్నా నిర్మాణ రంగంలో వ్యాపారిగా రానిస్తున్నాడు. అయితే ఇటీవల రేణుక పుట్టినరోజు జరిగింది. ఈ క్రమంలో తన పుట్టిన రోజు వేడుకులు దుబాయ్ లో జరుపుకుందాం అని రేణుక..నిఖిల్ ను అడిగింది. కానీ, నిఖిల్ దానికి నిరాకరించాడు. తన స్పెషల్ అకేషన్స్ ను భర్త పట్టించుకోట్లేదంటూ.. రేణుక తీవ్ర మనస్థాపానికి గురైంది.

కనీసం కొంతమంది ఫ్రెండ్స్ తో అయినా కలిసి.. ఢిల్లీలో సెలెబ్రేషన్స్ చేసుకుందాం అని అడిగింది. కానీ, దానికి కూడా నిఖిల్ ఒప్పుకోలేదు. ఇక ఈ విషయంలో ఇద్దరి మధ్యనా వాదనలు మొదలయ్యాయి. ఆ వాదనలు కాస్తా పెద్ద ఘర్షణకు దారి తీశాయి. ఆ ఆవేశంలో రేణుక.. నిఖిల్ ముఖంపై గట్టిగా కొట్టింది. దానితో నిఖిల్ ముక్కుకు బలమైన గాయం అయింది. అతని పళ్ళు కూడా ఊడిపోయాయి. తీవ్ర రక్తస్రావం అవ్వడంతో నిఖిల్ స్పృహ కోల్పోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ నిఖిల్ మరణించాడు. ప్రస్తుతం పోలీసులు రేణుకను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఆమెపై కేసును నమోదు చేశారు.

ఇక ఈ వార్త నెట్టింట హల్చల్ చేస్తోందో. ‘డోంట్ మ్యారి.. బి హ్యాపీ’ అంటూ.. ‘పెళ్లంటే నూరేళ్ళ పంట కాకుండా నూరేళ్ళ మంటలా మారుతోంది’ అంటూ.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా, సమాజంలో జరిగే ఇటువంటి సంఘటనలను చూస్తుంటే.. నేటి యువతకు వివాహ బంధం పైన కొత్త ప్రశ్నలు, భయాలు పుట్టుకొస్తున్నాయని చెప్పి తీరాల్సిందే. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom