iDreamPost
android-app
ios-app

పోలీస్‌ అధికారి దారుణం.. భార్య, మేనల్లుడ్ని చంపి తాను కూడా..

  • Published Jul 24, 2023 | 3:14 PM Updated Updated Jul 24, 2023 | 3:14 PM
  • Published Jul 24, 2023 | 3:14 PMUpdated Jul 24, 2023 | 3:14 PM
పోలీస్‌ అధికారి దారుణం.. భార్య, మేనల్లుడ్ని చంపి తాను కూడా..

మహారాష్ట్రలోని పుణెలో దారుణం చోటుచేసుకుంది. ఓ పోలీస్‌ ఉన్నతాధికారి తన భార్యను తుపాకితో కాల్చి చంపాడు. తుపాకి సౌండ్‌ విని ఇంట్లోకి వచ్చిన మేనల్లుడ్ని కూడా తుపాకితో కాల్చి చంపాడు. తర్వాత తాను కూడా అదే తుపాకితో కాల్చుకుని ఆ‍త్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..మహారాష్ట్రలోని పుణె సిటీకి చెందిన భగత్‌ గైక్వాడ్‌ అమరావతిలో ఏసీపీ విధులు నిర్వర్తిస్తున్నారు. ఏమైందో ఏమో తెలీదు కానీ..

సోమవారం తెల్లవారుజామున భగత్‌ తన భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ చికిని చినికి గాలి వానలా అయ్యింది. ఈ నేపథ్యంలోనే భగత్‌ తన సర్వీస్‌ రివాల్వర్‌ను చేతుల్లోకి తీసుకున్నాడు. దాంతో భార్యను కాల్చాడు. తుపాకి గుళ్లకు భార్య నేల కొరిగింది. తుపాకి సౌండ్‌తో ఇంటి బయట ఉ‍న్న అతడి మేనల్లుడు పరుగున ఇంట్లోకి వాచ్చాడు. రక్తం మడుగుల్లో పడి ఉన్న అత్తను చూసి గట్టిగా అరిచాడు. దీంతో భగత్‌ మేనల్లుడ్ని కూడా తుపాకితో కాల్చాడు. తుపాకి గుళ్ల కారణంగా మేనల్లుడు కూడా చనిపోయాడు.

ఇద్దరూ చనిపోయిన తర్వాత గైక్వాడ్‌ తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. తలకు తుపాకి గురిపెట్టుకుని కాల్చుకున్నాడు. తుపాకి గుండు అతడి తలలోనుంచి బయటకు దూసుకొచ్చింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు భగత్‌ భార్య, అల్లుడ్ని ఎందుకు చంపాడన్న దానిపై విచారణ చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş