Keerthi
Pig Butchering Scam: ఇప్పటికే రకరకాల సైబర్ స్కామ్స్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు కొత్తగా పిగ్ బుచరింగ్ స్కామ్ అనేది జోరుగా కొనసాగుతుంది. అయితే ఇందులో ముందుగా అందమైన అమ్మాయిలు పరిచయం పెంచుకోవడం, రొమాంటిక్ గా మెసేజ్ లు చేసి ఏదో ఒక ఆశ చూపి మోసం చేస్తారు. మరీ ఆ స్కామ్ పేరే పిగ్ బుచరింగ్ స్కామ్. ఇంతకీ ఏంటీ ‘పిగ్ బుచరింగ్’ మోసం? దీని వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? దీనిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
Pig Butchering Scam: ఇప్పటికే రకరకాల సైబర్ స్కామ్స్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు కొత్తగా పిగ్ బుచరింగ్ స్కామ్ అనేది జోరుగా కొనసాగుతుంది. అయితే ఇందులో ముందుగా అందమైన అమ్మాయిలు పరిచయం పెంచుకోవడం, రొమాంటిక్ గా మెసేజ్ లు చేసి ఏదో ఒక ఆశ చూపి మోసం చేస్తారు. మరీ ఆ స్కామ్ పేరే పిగ్ బుచరింగ్ స్కామ్. ఇంతకీ ఏంటీ ‘పిగ్ బుచరింగ్’ మోసం? దీని వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? దీనిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
Keerthi
దేశంలో రాను రాను టెక్నాలజీ మరీంత అభివృద్ధి చెందుతుందని ఆనంద పడాలో.. లేక ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో సైబర్ నేరాలు పెరుగుతున్నయని ఆందోళన పడాలో ప్రజలకు అర్ధం కావడం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మోసాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఏదో ఒక రూపంలో ప్రజలను మోసం చేస్తూ సైబర్ నేరగాళ్లు నిలువున ముంచేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాాభాలు పొందే అవకాశం వంటివి సోషల్ మీడియాలో కల్పిస్తున్నమని వల వేసి, అమాయకుల ఆశలనే పెట్టుబడులుగా మార్చుకుంటున్నారు కొంతమంది కేటుగాళ్లు.
ఇప్పటికే రకరకాల సైబర్ స్కామ్స్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో కొత్తరకం సైబర్ స్కామ్ అనేది జోరుగా కొనసాగుతుంది. అయితే ఈ స్కామ్ వినడానికి పాతదే కానీ, ఈ స్కామ్ లో జరుగుతున్న మోసాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఈ స్కామ్ లో ప్రేమగా పరిచయాలు చేసుకుంటూ, రొమాంటిక్ గా మెసేజ్ లు చేసి ఏదో ఒక ఆశ చూపి మోసం చేస్తారు. మరీ ఆ స్కామ్ పేరే పిగ్ బుచరింగ్ స్కామ్. ఇంతకీ ఏంటీ ‘పిగ్ బుచరింగ్’ మోసం? దీని వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? దీనిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
పిగ్ బుచరింగ్ స్కామ్ ప్రస్తుతం ఈ తరహా స్కామ్ లో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఈ స్కామ్ లో అందమైన అమ్మాయిల నకిలీ ప్రొఫైల్ లను ఉపాయోగిస్తారు. ఈ క్రమంలోనే ఇన్ స్టా వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పరిచయాలు పెంచుకుంటారు. ఇక ఆ పరిచయం కాస్త ప్రేమగా, స్నేహం ఉన్నట్లు నటిస్తూ మెసేజ్ లు చేస్తారు. ఆ తర్వాత అధిక పెట్టుబడులు పెట్టించి, ఎక్కువ మొత్తంలో డబ్బు ఆశ చూపించి.. ఆ తర్వాత భారీగా డబ్బును దొచుకుంటారు. ఇలా దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ పిగ్ బుచరింగ్ స్కామ్ లో రూ.25 వేల కోట్లు వరకు చాలామంది మోసపోయారని అంచన. అయితే ఈ పిగ్ బుచరింగ్ స్కామ్ ను కనిపెట్టానికి బాధితుడిగా మారి 6 వారలుగా పరిశోధన చేసి ఈ స్కామ్ గురించి వెలుగులోకి బయటపెట్టారు ప్రముఖ బీబీసీ మిడియా జర్నలిస్ట్. ఈ క్రమంలోనే ఆయనకు మొదట ఇన్ స్టా గ్రామ్ లో జస్సిక అనే అమ్మాయి పరిచయమైంది. ఆమె ప్రతిరోజు సాయంత్రం 4 గంటల సదురు జర్నలిస్ట్ కు మెసేజ్ చేసిది. అలాగే తాను చికాగోలో ఉంటున్న అంటూ పరిచయం చేసుకుంటూ.. సదరు వ్యక్తి వివరాలను కూడా అడిగి తెలుసుకుంది.
అయితే నిజానికి ఇదాంత ఓ స్కామ్ అని ముందే తెలుసుకునే సదరు జర్నలిస్ట్ తన ఫ్రొపైల్ లో అసలు వ్యక్తి ఎవరో అని తెలుసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే.. ఆమె పెట్టిన ఫ్రొపైల్స్ ను సెర్చ్ చేయగా ఇప్పటికే ఆ ఫోటోలు చాలాా డేటింగ్ వెబ్ సైట్ లో చాలామంది వినియోగించుకుంటున్నారట. కానీ, నిజానికి ఆ ఫోటోలో ఉన్నది ఓ జర్మనీ ఇన్ఫులెన్సర్. కానీ, ఆమె ఫోటో ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఇదిలా ఉంటే.. జెస్సిక పేరుతో పరిచయమైన ఆమె ఓ రోజు .. తాను క్రిప్టో కరెన్సీ ద్వారా తాను చాలా ధనవంతురాలు అయ్యానని, కొన్ని స్రీన్ షార్ట్స్ పెట్టింది. అలాగే సదరు జర్నలిస్ట్ కు కూడా పెట్టుబడి పెడితే కోటిశ్వరుడు అవుతడని నమ్మ బలికింది. కానీ, తన వద్ద అంతా డబ్బు లేదని కేవలం రూ.20000 మాత్రమే ఉందని చెప్పడంతో తాను పేద వాడిగా మాట్లాడింది. ఇలా కొనసాగుతూ ఓ రోజు ఈ స్కామ్ కు పాల్పడుతున్న అమ్మాయి పొరపాటున చైనాలో మెసేజ్ పెట్టింది. బహుశా తాను చైనాలో కాల్ స్కామ్ సెంటర్ లో పనిచేస్తుందెమోనని ఈ జర్నలిస్ట్ అనుకున్నారట. దీంతో ఎలాగైన వీరిని కనిపెట్టాలని అనుకున్న సదరు జర్నలిస్ట్ ఆ స్కామర్లకు తాను బీబీసీ జర్నలిస్ట్ అని పరిచయం చేసుకున్నారు.
అంతేకాకుండా.. ఇదొక స్కామ్ సెంటర్ కదా మీతో ఎవరు ఇదాంత చేయిస్తున్నారని అడిగారట. అప్పుడు సదురు అమ్మాయి నిజమే ఇదొక స్కామ్ సెంటర్ నేను దుబాయిలో ఉన్నాను. రోజు ఇలా లక్షల్లో డబ్బు సంపాదించకపోతే నన్ను చాలామంది హత్యచారం చేస్తారు. దారుణంగా కొడతారు అని చెప్పిందట. అంతేకాకుండా తన నుంచి ఇంక డబ్బు వసూలు చేయడానికి చాలా ప్రయాత్నాలు చేసిందట. చివరికి డబ్బులు ఇస్తే మాటలు లేకపోతే లేదంటూ ఈ జర్నలిస్ట్ ఎకౌంట్ ను ఆ స్కామర్లు బ్లాక్ చేశారు. అనంతరం ఈ స్కామ్ కు సంబంధించి వివరాలను సదురు జర్నలిస్ట్ సైబర్ పోలీసులకు సమాచారం అందించారట. కనుక మీకు కూడా సోషల్ మీడియాలో అందమైన అమ్మాయిల ఫ్రొపైల్ తో ఈ తరహా మెసేజ్ లు రావచ్చు. అందుకే దయచేసి ఇలాంటి మెసేజ్ లు వచ్చినప్పుడు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించండి. అంతేకాని, ఈ పిగ్ బుచరింగ్ స్కామ్ లో మోసపోయి లక్షలు పొగట్టుకోకండి.