iDreamPost
android-app
ios-app

మట్టి కింద యువతి శరీరం.. అంతా మిస్టరీయే!

మట్టి కింద యువతి శరీరం.. అంతా మిస్టరీయే!

హిజిలికాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిథిలో గుర్తు తెలియని యువతి శవం కలకలం రేపింది. పొలంలో మట్టిలో పాతి పెట్టబడిన ఆ యువతి శవం ఎవరిదన్నది మిస్టరీగా మారింది. పోలీసులు యువతి ఫొటో ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొద్దిరోజుల క్రితం ఓ రైతు గంజాం జిల్లా, కుకుడాఖండిలోని మౌలపల్లి గ్రామంలోని తన పొలంలోకి వెళ్లాడు. అక్కడ పొలంలో ఓ చోట ఎవరో తవ్వినట్లు కనిపించింది. దీంతో ఆ రైతుకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన చోట కొద్దిగా తవ్వి చూడగా..

ఎవరిదో శవం ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆస్కా మెజిస్ట్రేట్‌ సమక్షంలో యువతి శవాన్ని బయటకు తీశారు. యువతి శవాన్ని బయటకు తీసిన సమయంలో.. ఆమె మెడలో బంగారు గొలుసు, హ్యాండ్‌ బ్యాగ్‌, ఆ బ్యాగులో ఓ ఫొటోను గుర్తించారు. ఆమె ఎవరు? ఏ ప్రాంతానికి చెందినది? ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అన్నవి ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు సదరు యువతిని చంపేసి ఉంటారని,

తర్వాత ఇక్కడికి తీసుకువచ్చి పాతి పెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత ఆమె ఎలా చనిపోయిందన్న దానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక, ఈ గుర్తు తెలియని శవం విషయం ఆ గ్రామంతో పాటు చుట్టు పక్కలి గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి, పొలంలో మిస్టరీగా దొరికిన యువతి శవంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş