iDreamPost
android-app
ios-app

కిలాడీ లేడీలు.. వీళ్లు చేసిందేంటో తెలిస్తే నోళ్లు తెరుస్తారు!

  • Published Sep 07, 2023 | 7:45 PM Updated Updated Dec 09, 2023 | 12:02 PM

అవును, మీరు విన్నది నిజమే. వీళ్లు చేసిన పనేంటో తెలిస్తే నోళ్లు తెరవడం ఖాయం. విషయం ఏంటంటే..? భర్తలు బాగానే సంపాదిస్తున్నా..

అవును, మీరు విన్నది నిజమే. వీళ్లు చేసిన పనేంటో తెలిస్తే నోళ్లు తెరవడం ఖాయం. విషయం ఏంటంటే..? భర్తలు బాగానే సంపాదిస్తున్నా..

  • Published Sep 07, 2023 | 7:45 PMUpdated Dec 09, 2023 | 12:02 PM
కిలాడీ లేడీలు.. వీళ్లు చేసిందేంటో తెలిస్తే నోళ్లు తెరుస్తారు!

పైన ఫొటోలో మహిళలు అమాయకంగా కనిపిస్తున్నారని అస్సలు జాలి చూపించకండి. ఎందుకుంటే.. ఈ కిలాడి లేడీలు చేసిన దారుణం అలాంటిది మరి. అవును, మీరు విన్నది నిజమే. వీళ్లు చేసిన పనేంటో తెలిస్తే నోళ్లు తెరవడం ఖాయం. విషయం ఏంటంటే..? భర్తలు బాగానే సంపాదిస్తున్నా.. విలాసాలకు అలవాటుపడి ఈజీ మనీ కోసం కక్కుర్తి పడి దారుణాలకు ఒడిగట్టారు. అయితే ఇక్కడ ఓ మహిళ ప్లాన్ వేస్తే.. మరో ముగ్గురు మహిళలు దాన్ని అమలు చేశారు. తాజాగా ఇదే స్కెచ్ ను అమలు పరిచడంతో చివరికి ఈ కిలాడీ లేడీలు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. ఇంతకు ఈ మహిళలు చేసిన నేరం ఏంటి? సినిమాను తలదన్నేలా కనిపిస్తున్నా ఈ ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

అది ఒంగోలులోని కృష్ణా నగర్ ప్రాంతం. ఇక్కడే నివాసం ఉంటున్న బ్యూటిషియన్ రజియాపై తాజాగా కొందరు మహిళలు యాసిడ్ తో దాడి చేసి నగదు, బంగారు అభరణాలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. వీరి దాడిలో రజియా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పోందుతుంది. అయితే ఆ మహిళ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు 24 గంటల్లోనే ఈ కేసును చేదించారు. రజియాపై దాడి చేసి చోరికి పాల్పడ్డ ఆ నలుగురు మహిళా నిందితులను అరెస్ట్ చేశారు. అయితే చోరీ కేసును నలుగురు మహిళలు పక్కా ప్లాన్ ప్రకారమే అమలు పరిచి విజయం సాధించారు. దీంతో ఇప్పుడు వీళ్లంతా జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. మరో విషయం ఏంటంటే?.. ఈ చోరీ కన్న ముందు వీళ్లంతా పక్కా పథకం ప్రకారమే అడుగులు వేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నలుగురిలో దాసరి భాను అనే మహిళ ప్లాన్ లో భాగంగానే వీరంతా దొంగతనం చేశారని పోలీసులు తేల్చారు.

అసలేం జరిగిందంటే?

ఒంగోలులోని కృష్ణా నగర్ లో రజియా అనే మహిళ స్థానికంగా బ్యూటీపార్లర్ నడిపిస్తున్నారు. అయితే దాసరి భాను ఆధ్వర్యంలో చోరీలకు పాల్పడుతున్న ఈ మహిళల ముఠా విలాసాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. ఇప్పటికీ ఎన్నో చోరీలు చేసి పోలీసులకు దొరక్కండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే బ్యూటీషియన్ రజియాపై దాడి చేసి అన్నీ దోచుకెళ్లాలని ముఠా హెడ్ దాసరి భాను స్కాచ్ వేసింది. దీన్ని అమలు పరిచేందుకు మిగతా ముగ్గురు మహిళలు రంగంలోకి దిగారు. అనుకున్నట్లుగానే ముగ్గురు కలిసి బుధవారం రజియా బ్యూటీపార్ల షాపులోకి వెళ్లారు.

ఒకరు ఫేషియల్ చేయించుకోగా, మరొక మహిళ హైబ్రోస్ చేయించుకుంది. అయితే ఇదే సమయంలో మరో మహిళ వాష్ రూంలోకి వెళ్లి తన వెంట తెచ్చుకున్న యాసిడ్, మత్తు పదార్థాలతో బయటకు వచ్చింది. ఇక వస్తూ వస్తూనే రజియాపై మత్తు జల్లి, ముఖంపై యాసిడ్ తో దాడి చేసింది. దీంతో వెంటనే కొందరు ఆమె ఒంటిపై నగలు తీసుకోగా, మరొకరు కౌంటర్ లో ఉన్న నగదును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దీన్ని గమనించిన కొందరు స్థానికులు రజియాను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంరం పోలీసులు సమాచారం అందించడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetGalabetfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş