iDreamPost
android-app
ios-app

షాకింగ్: భార్యను చంపి ఆమె మెదడును తిన్న భర్త!

  • Published Jul 07, 2023 | 4:08 PM Updated Updated Jul 07, 2023 | 4:08 PM
  • Published Jul 07, 2023 | 4:08 PMUpdated Jul 07, 2023 | 4:08 PM
షాకింగ్: భార్యను చంపి ఆమె మెదడును తిన్న భర్త!

సింహాలు అడవిలో ఉండే జంతువులను వేటాడి చంపి వాటి మాంసాన్ని పీక్కుతింటుంటాయి. ఇలాంటి ఘటనలు మనం ఎక్కువగా సినిమాల్లో, డిస్కవరి ఛానెల్ లో చూస్తుంటాము. కానీ, నిజంగా ఓ మనిషి మరో మనిషిని చంపి మెదడును తినడం ఎప్పుడైనా చూశారా? అవును.. మీరు విన్నది నిజమే. ఓ భర్త తన భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మెదడును మెక్సికన్ సాంప్రదాయ వంటకంలో కలిపి తిన్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే?

ఉత్తర అమెరికా మెక్సికోలోని ప్యూబ్లాలో మారియా మోంట్‌సెరాట్ (32)-అల్వారో దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే.. మారియా భర్త అల్వారో తాంత్రిక పూజలు చేసేవాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. జూన్ 29న అల్వారో తన భార్య మారియాను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఇక ఇంతటితో ఆగని ఈ దుర్మార్గుడు.. ఆమె మెదడుని మెక్సికన్ సాంప్రదాయ వంటకంలో కలుపుకుని తినేశాడు.

ఇంతే కాదండోయో.. ఆమె పుర్రెను యాష్ ట్రేగా కూడా వినియోగించుకున్నాడు. ఇక మరుసటి రోజు అతని బంధువులు ఇంటికి వచ్చి చూడగా అసలు విషయం బయటపడింది. దీంతో వెంటనే వాళ్లు పోలీసులకు సమచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితుడు అల్వారోను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom