iDreamPost
android-app
ios-app

దారుణం: అక్కా చెల్లెళ్లను దారుణంగా హత్య చేసిన దండగులు!

  • Published Jul 19, 2023 | 4:03 PM Updated Updated Jul 19, 2023 | 4:03 PM
  • Published Jul 19, 2023 | 4:03 PMUpdated Jul 19, 2023 | 4:03 PM
దారుణం: అక్కా చెల్లెళ్లను దారుణంగా హత్య చేసిన దండగులు!

తెలంగాణలో మరో దారుణం చోటు చేసుకుంది. కొందరు గుర్తు తెలియని దుండగులు ఇద్దరు అక్కా చెల్లెళ్లలను దారుణంగా హత్య చేశారు. ఇక దీంతో సరిపెట్టిన ఆ దుర్మార్గులు.. మరో కిరాతకానికి పాల్పడ్డారు. అనంతరం ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకి ఈ అక్కా చెల్లెళ్లను ఎవరు హత్య చేశారు? అందుకు దారి తీసిన కారణాలు ఏంటి? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ లో మగ్గిడి గంగవ్వ (62), మగ్గిడి రాజవ్వ (72) అనే ఇద్దరు అక్కా చెల్లెళ్లు గత 20 ఏళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. ఆదివారం రోజు ఈ అక్కా చెల్లెళ్లు ఇద్దరు స్థానికంగా ఉన్న మల్లన్న గుట్టలో కుటుంబ సభ్యులతో కలిసి ఓ దావత్ లో పాల్గోన్నారు. అక్కడి నుంచి అదే రోజు తిరిగి జిరాయత్ నగర్ కు వచ్చారు. ఇక మంగళవారం గంగవ్వ కుమారుడు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి మళ్లీ జిరాయత్ నగర్ లో ఉంటున్న ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. కట్ చేస్తే.. బుధవారం తెల్లవారు జామున వీరుంటున్న ఇంట్లో నుంచి పొగలు రావడం మొదలయ్యాయి.

దీంతో స్థానికులు గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా.. గంగవ్వ, రాజవ్వ ఇద్దరు దారుణ హత్యకు గురై కనిపించారు. ఈ సీన్ చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న వారి కుమారులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరో గుర్తు తెలియని దుండుగులు గంగవ్వ, రాజవ్వను దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత ఇంటికి నిప్పు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: అర్థరాత్రి జోరు నిద్రలో భార్య… ఆ తర్వాత భర్త చేసిన పనికి అంతా షాక్!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom