iDreamPost
android-app
ios-app

ప్రియురాలి కోసం చివరి మాటలు.. ‘చావ బోతున్నా.. అంత్యక్రియలకు రా!’

  • Published Aug 14, 2023 | 11:03 AM Updated Updated Aug 14, 2023 | 11:03 AM
  • Published Aug 14, 2023 | 11:03 AMUpdated Aug 14, 2023 | 11:03 AM
ప్రియురాలి కోసం చివరి మాటలు.. ‘చావ బోతున్నా.. అంత్యక్రియలకు రా!’

ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు తనకు దక్కదన్న బాధతో ఓ యువకుడు దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రియురాలు దక్కదన్న బాధతో ఆత్మహత్యకు యత్నించాడు. ఆస్పత్రిలో ఆమె కోసం తన చివరి మాటల్ని వీడియో తీశాడు. తన అంత్యక్రియలకు తప్పకుండా రావాలంటూ ప్రియురాలిని ఆహ్వానించాడు. ప్రియురాలిని తప్పుబట్టకుండా.. ఆమె కుటుంబాన్ని తప్పుబట్టకుండా.. అందరూ సంతోషంగా ఉండాలంటూ ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని నేలమంగలకు చెందిన 22 ఏళ్ల కిరణ్‌, అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

కిరణ్‌ తన ప్రేమకు గుర్తుగా తన ప్రియురాలికి ఆగస్టు 3న ఓ బంగారు రింగ్‌, కాలు గొలుసులు కొనించాడు. వీటిని చూసిన ప్రియురాలి తండ్రి.. అవి ఎక్కడివి అని అడిగాడు. ఆమె తన ప్రేమ సంగతి చెప్పింది. అయితే, ఆయన వీరిద్దరి ప్రేమకు ఒప్పుకోలేదు. పెళ్లికి ససేమీరా అన్నాడు. ఈ విషయం ఆ యువతి కిరణ్‌కు చెప్పింది. ‘మన పెళ్లి ఇక జరగదు’ అనేసింది. దీంతో కిరణ్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ప్రియురాలు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే చనిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఆగస్టు 9వ తేదీన పురుగుల మందు తాగాడు. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఆస్పత్రిలో చనిపోయే ముందు అతడు తన ప్రియురాలి కోసం తన మాటలను రికార్డ్‌ చేశాడు. ఆ వీడియోలో.. ‘‘ హాయ్‌ బంగారీ.. మిమ్మల్నందర్నీ విడిచిపెట్టి వెళ్లిపోతున్నాను కన్నా.. మీ నాన్న చెప్పినట్లు ఓ మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని, నీకు పుట్టబోయే బిడ్డకు నాపేరే పెట్టండి. అకస్మాత్తుగా చనిపోతున్నా.. దయచేసి నా అంత్యక్రియలకు రా.. యమునను తీసుకుని రా.. మీ అమ్మను కూడా తీసుకుని రా.. చల్లగా ఉండు.. మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలి’’ అంటూ ప్రాణాలు విడిచాడు. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తున్న జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి, ప్రియురాలు తనకు దక్కదన్న బాధతో ప్రాణాలు తీసుకున్న కిరణ్‌ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom