iDreamPost
android-app
ios-app

వాట్సప్ స్టేటస్‌తో బయటపడ్డ అక్రమ సంబంధం..భర్తకు తెలిసే సరికి

పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవ్వరూ చూస్తారులే అనుకుంటుందట. అలాగే అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు నెరుపుతున్న వాళ్లు ఇలానే భావిస్తుంటారు. జీవిత భాగస్వామికి తెలియదనుకుని..

పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవ్వరూ చూస్తారులే అనుకుంటుందట. అలాగే అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు నెరుపుతున్న వాళ్లు ఇలానే భావిస్తుంటారు. జీవిత భాగస్వామికి తెలియదనుకుని..

వాట్సప్ స్టేటస్‌తో బయటపడ్డ అక్రమ సంబంధం..భర్తకు తెలిసే సరికి

ఇంటర్నెట్.. సోషల్ మీడియా మాధ్యమాలు స్మార్ట్ ఫోన్ల వినియోగదారులకి రెండు కళ్లు లాంటివి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా బతకలేరు. అయితే ఏదైనా అతిగా వినియోగిస్తే అనార్థాలే అని నిరూపించాయి సామాజిక మాధ్యమాలు. ముఖ్యంగా నేటి యూత్ .. కోడి కూసింది మొదలు.. చందమామ ఇంటికి చేరుతున్న వరకు వీటిల్లోనే తలమునకలు అయిపోతున్నారు. సోషల్ మీడియాను వినియోగిస్తూ.. తమకు నచ్చిన విషయాన్ని షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల అనార్థాలు, అపార్థాలే కాదు గొడవలు కూడా జరిగాయి. ఆత్మహత్యలు, హత్యలు చోటుచేసుకున్న దాఖలాలు ఉన్నాయి. తాజాగా వాట్సప్ స్టేటస్ వల్ల ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ ఘటన కర్ణాటకలోని మైసూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 28 ఏళ్ల శృతికి వివాహామై ఇద్దరు పిల్లలు ఉన్నారు. మురళీ అనే 22 ఏళ్ల కుర్రాడితో స్నేహం ఏర్పడింది. వీరిద్దరి ఒకే ఊరు కావడంతో స్నేహం కాస్త ప్రేమగా మారటానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ లవ్ కాస్త.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే ఆ మహిళను కలిసినప్పుడుల్లా ఆమెతో దిగిన ఫోటోలను మురళీ ఇటీవల వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. అతడి వాట్సప్ స్టేటస్ ఊరిలో ప్రజలు చూడటంతో .. వీరి అక్రమ సంబంధం గురించి కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. కుటుంబ సభ్యులకు తెలియడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.

వీరిద్దరూ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. ఆ ఫోటోలను చూసిన అత్తమామలు, భర్త, కుటుంబ సభ్యులు ప్రశ్నించే సరికి.. అవమానంగా భావించిన శృతి.. ఇంట్లోనే ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. శృతి చనిపోయిందన్న విషయం తెలిసిన ఆమె ప్రియుడు మురళీ కూడా భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. వాట్సప్ స్టేటస్ వల్ల ఇద్దరి జీవితాలు అర్థంతరంగా ముగిసిపోయాయి. సోషల్ మీడియా కారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి