iDreamPost
android-app
ios-app

బాయ్ ఫ్రెండ్‌తో కలిసి కిడ్నాప్ నాటకం! తండ్రిని మోసం చేసిన కూతురు!

అమ్మో ఈ అమ్మాయి తెలివి తేటలు .. నిజంగా చదువులో పెట్టి ఉంటే.. డాక్టర్ అయ్యేది. కానీ నిజ జీవితంలో యాక్టింగ్ చేసి తల్లిదండ్రులకు తిప్పలు తేవడంతో పాటు ఏకంగా ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది.. ఇంతకు ఆమె చేసిన ఘనకార్యం ఏంటంటే..?

అమ్మో ఈ అమ్మాయి తెలివి తేటలు .. నిజంగా చదువులో పెట్టి ఉంటే.. డాక్టర్ అయ్యేది. కానీ నిజ జీవితంలో యాక్టింగ్ చేసి తల్లిదండ్రులకు తిప్పలు తేవడంతో పాటు ఏకంగా ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది.. ఇంతకు ఆమె చేసిన ఘనకార్యం ఏంటంటే..?

బాయ్ ఫ్రెండ్‌తో కలిసి కిడ్నాప్ నాటకం! తండ్రిని మోసం చేసిన కూతురు!

సినిమా ప్రభావం ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని కొందరి వాదన. వారి వాదన ఏమో కానీ.. కొన్ని సంఘటనలు చూస్తుంటే.. వామ్మో అనిపించకమానదు. డబ్బుల కోసం దిగజారుడు వ్యవహారాలకు ఒడిగడుతున్నారు కొందరు. ఇందులో అమ్మాయిలు కూడా తక్కువేం తినడం లేదు. వాస్తవంగా చెప్పాలంటే.. ఆడ పిల్లలు, ఏం చెప్పినా, ఏం చేసినా సాగిపోతుందన్న ధోరణిలో ఉన్న కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని చూశారా.. డాక్టర్ చదవాల్సిన ఈమె.. వెండితెరపై యాక్టర్ కాలేను కదా అనుకుని నిజ జీవితంలో వీర లెవల్లో ఫెర్ఫ్మామెన్స్ చూపించింది. యల్ లైఫ్‌లో హీరోయిన్‌ను మించిపోయే యాక్టింగ్ చేసి.. తల్లిదండ్రులకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. ఇంతకు ఆమె ఏం చేసిందంటే..?

మధ్యప్రదేశ్‌లోని శివ్ పురికి చెందిన కావ్య థాకడ్ (21) అనే యువతి.. రాజస్థాన్ కోటాలో నీట్ ప్రవేశ పరీక్ష కోసం సిద్ధమౌతుంది. అంతలో ఆమె కిడ్నాప్‌కు గురైంది. కావ్య ఆచూకీ కానరాకపోవడంతో తండ్రి.. రఘువవీర్ ధాకడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కావ్యను కిడ్నాప్ చేశారని, తాళ్లతో కట్టేసిన ఫోటోలు తనకు పంపారని, ఆమెను విడిచిపెట్టాలంటే రూ. 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారంటూ పేర్కొన్నాడు. ఈ విషయంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాథిత్య సింథియా కూడా ఆమెను సురక్షితంగా తీసుకురావాలంటూ కోరారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఇద్దరు అబ్బాయిలతో కలిసి నడుస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో ఆమె ఆచూకీ చెప్పాలంటూ రూ. 20 వేలు రివార్డు ఇస్తామని కూడా ఎస్పీ ప్రకటించారు. అంతలో ఓ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.. అసలు ఆమె కిడ్నాప్ కాలేదని, రాజస్తాన్‌లో లేదని. ఆమె ఇండోర్ లో ఉందని తేలింది.

Kavya dhakad make fake kidnap for a trip

ఫారిన్ వెళ్లేందుకు తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి కిడ్నాప్ నాటకం ఆడింది కావ్య. కోటా ఎస్పీ అమృత దుహాన్ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. గత ఏడాది ఆగస్టు 3 న నీట్ కోచింగ్ కోసం అమ్మతో కలిసి కోటా నగరానికి వచ్చింది కావ్య. ఆమెను అక్కడ హాస్టల్లో చేర్చి వెళ్లిపోయింది తల్లి. అయితే చదువుకోవడం ఇష్టం లేని కావ్య.. మూడు రోజులు మాత్రమే అక్కడే ఉండి.. తిరిగి ఇండోర్ వెళ్లిపోయింది. అక్కడ స్నేహితులతో కలిసి ఉంటోంది. అయితే తల్లిదండ్రులకు మాత్రం తాను కోటాలో ఉండి కోచింగ్ తీసుకుంటున్నట్లు, పరీక్షలు రాస్తున్నట్లు కలరింగ్ ఇచ్చింది. నిజమేనని నమ్మేశారు తల్లిదండ్రులు. ఇదే సమయంలో విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకున్న ఆమె.. ఓ ప్లాన్ వేసింది. తన బాయ్ ఫ్రెండ్, మరో స్నేహితుడితో కలిసి కిడ్నాప్ నాటకం ఆడింది. రూ. 30 లక్షలు ఇస్తే.. విదేశాలకు చెక్కేయొచ్చు అనుకుంది.. కానీ కథ అడ్డం తిరిగింది.